
Puri Jagannadh- VijaySethupathi movie: మాస్ ఆడియన్స్ కి ఆల్ టైం ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్.ఇపుడు పూరి అలానే విజయ్ సేతుపతి కంబినేషన్లో సినిమా వస్తుంది అంటే అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ పనులు శర వేగంగా ముందుకు వెళ్తున్నాయి.. జెబి మోషన్ పిక్చర్స్‌పై ఛార్మి కౌర్ మరియు జెబి నారాయణరావు కొండ్రోళ్ల సహకారంతో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయ్ సేతుపతి సరసన టాలీవుడ్ లక్కీ చార్మ్, సంయుక్త కథానాయికగా నటిస్తోంది.గత కొంత కాలంగా పూరి జగన్నాధ్ వరుస పరాజయాలతో ఫ్యాన్స్ కి నిరాశను కలిగించారు.అటు విజయ్ సేతుపతి మాత్రం వరుస హిట్స్ తో అభిమానులను అలరిస్తున్నారు.ఎప్పుడైతే విజయ్ సేతుపతి పూరితో సినిమాను అనౌన్స్ చేసారో అప్పటి నుంచి ఇరువురి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.ఈ సారి పూరి జగన్నాధ్ ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు అని ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నారు మేకర్స్. విజయ్ సేతుపతి సరసన టాలీవుడ్ లక్కీ చార్మ్, సంయుక్త కథానాయికగా నటిస్తోంది.Puri Jagannadh- VijaySethupathi movie
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మరియు మరిన్ని చిత్రాలలో తన వర్క్ తో ప్రసిద్ధి చెందిన జాతీయ అవార్డు-విజేత స్వరకర్త హర్షవర్ధన్ రామేశ్వర్ పూరి, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం అందించడానికి బోర్డులోకి వచ్చారని మూవీ టీం ప్రకటించారు.యానిమల్ సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్..ఇపుడు పూరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.టబు, విజయ్ కుమార్ ముఖ్య తారాగణం కాగా, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ నవ్వించే పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభమవుతుంది, ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటుంది.ఈ పాన్-ఇండియా ఎంటర్టైనర్ #పూరి సేతుపతి, ఐదు భాషలలో- తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీలలో విడుదల చేయబడుతుంది.” స్పిరిట్ ” లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్న హర్షవర్ధన్ పూరి ఫ్యాన్స్ ను తన మ్యూజిక్ తో ఎంతగా ఆకట్టుకుంటారో చూడాలి మరి.