దుమ్ములేపుతున్న కూలీ కలెక్షన్స్.! ఫస్ట్ డే కలెక్షన్ ఎంత…?

Coolie’s First Day Collection: కూలీ కూలీ కూలీ.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో బాగా వినిపిస్తున్న సినిమా. సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జునల క్రేజీ కాంబోలో రూపొందుతోన్న కూలీ సినిమా ఆగష్టు 14న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది. అయితే.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి ముందే కలెక్షన్స్ తో దుమ్ములేపుతుంది. ఇంతకీ.. ఇంత వరకు ప్రీ సేల్స్ లో ఎంత కలెక్ట్ చేసింది..? ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా…?

కూలీ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగా లోకేష్‌ కనకరాజ్ ఈ మూవీని తెరకెక్కించాడని.. కూలీ సంచలనం సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ క్యారెక్టర్ చేయడం అనేది పెద్ద హైలెట్ అంటున్నారు సినీ జనాలు. అయితే.. ఈ మూవీకి తమిళనాడులోనో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్ సీస్ లో సైతం విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత క్రేజ్ పెరుగుతుంది.

ఈ సినిమాకి ఇప్పటి వరకు 7 లక్షల టిక్కెట్లు సేల్ అయ్యాయటని.. కలెక్షన్స్ విషయానికి వస్తే.. 70 కోట్లు వచ్చాయని ట్రేడ్ పండితులు సమాచారం. మరి.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందంటే.. ఖఛ్చితంగా 100 కోట్లకు మించిన కలెక్షన్ రావడం ఖాయమని అంచనా వుంది. ఈ అంచనాకు మించి కలెక్ట్ చేసినా ఆశ్యర్యపోనవసరం లేదు అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాని సన్ పిక్చర్స్ రాజీపడకుండా మంచి క్వాలిటీ తో నిర్మించారు. అయితే.. లోకేష్‌ కనకరాజ్ షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి పక్కాగా ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు. అది బాగా వర్కవుట్ అయ్యింది. Coolie’s First Day Collection.

ఈ మూవీ ప్రీమియర్స్‌ను ఆగస్టు 13న వేయనున్నారు. దీంతో అమెరికాలో ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున టికెట్ బుకింగ్స్ చేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 1.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే, ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ వస్తాయని.. ఇది సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. అలాగే కోలీవుడ్ కి ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటీ లేదు. టాలీవుడ్ కు నాలుగు సినిమాలు ఉన్నాయి. సో.. కూలీ సినిమా కోలీవుడ్ కి ఫస్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ట్రెండ్ చూస్తుంటే.. ఇది నిజమయ్యేలా అనిపిస్తుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/good-news-for-darling-fans-prabhas-marriage-movie-update/