అట్లీ మూవీలో బన్నీ అన్ని రోల్స్ చేస్తున్నారా..?

Bunny Atlee’s Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఇద్దరి కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో అసలు కథ ఏంటి… సినిమా ఎలా ఉండబోతుంది..? అనే క్యూరియాసిటీ రోజురోజుకు పెరుగుతుంది. అయితే.. ఈ సినిమాలో బన్నీ డబుల్ రోల్ అంటూ ప్రచారం జరిగింది. ఆతర్వాత త్రిబుల్ రోల్ అంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా నాలుగు క్యారెక్టర్స్ లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఇది నిజమేనా…? అసలు ఏం జరుగుతోంది..?

ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో బన్నీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే.. ఒకటి తాత క్యారెక్టర్ కాగా, రెండోది తండ్రి క్యారెక్టర్.. ఇంకో రెండు కొడుకు క్యారెక్టర్స్.. మొత్తం నాలుగు క్యారెక్టర్స్ అని.. ఈ నాలుగు క్యారెక్టర్స్ కి సమానంగా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ముందుగా వేరే ఆర్టిస్టులతో ఈ పాత్రలు చేయించాలి అనుకున్నారట. అయితే.. బన్నీ మీద అన్ని గెటప్స్ లుక్ టెస్ట్ చేశారట. ఈ గెటప్స్ అన్నీ బాగా ఉన్నాయని యూనిట్ మెంబర్స్ నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో.. బన్నీ, అట్లీ.. ఇద్దరూ కూడా ఓకే అనుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. Bunny Atlee’s Movie.

ఈ జనరేషన్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశలో త్రిబుల్ రోల్ చేశారు. అలాగే కళ్యాణ్ రామ్ అమిగోస్ లో త్రిబుల్ రోల్ చేశారు. ఈ జనరేషన్ లో అంతకు మించి ఎక్కువ క్యారెక్టర్స్ ఎవరూ ట్రై చేయలేదు. ప్రచారంలో ఉన్నట్టుగా నాలుగు పాత్రల్లో బన్నీ నటిస్తే.. స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఇన్ని పాత్రలు ఒకే సినిమాలో చేసిన ఘనత అల్లు అర్జున్ కే దక్కుతుంది. దీని గురించి ప్రచారం జరుగుతున్నా.. మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. అయితే.. ఇది రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే డిఫరెంట్ స్టోరీ కావడంతో నాలుగు పాత్రలు పోషించడం అనేది నిజమే కావచ్చు అంటున్నారు సినీ జనాలు.

పుష్ప 2 సినిమాతో చరిత్ర సృష్టించడంతో ఈసారి అంతకు మించిన సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఈ కథను ఎంచుకున్నాడు. విజువల్ గా వావ్ అనేలా ఉంటుందని.. ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని టీమ్ చెబుతున్నారు. ఇందులో బన్నీకి జంటగా దీపికా పడుకునే నటిస్తున్నట్టుగా ప్రకటించారు. మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్ కన్ ఫర్మ్ అని టాక్ వినిపించింది. ఇటీవల రష్మిక, భాగ్యశ్రీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముంబాయిలో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. 2027లో ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్. మరి.. ఈ సినిమాతో బన్నీ, అట్లీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/nagarjuna-and-chaitus-decision-to-choose-tamil-directors-for-milestone-films-their-decision-is-right/