
Lokesh Kanagaraj’s movie Coolie: లోకేష్ కనకరాజ్.. తన ప్రతి సినిమాతో సంచలనం సృష్టిస్తున్నాడు. వరుసగా సక్సెస్ సాధిస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అలాగే స్టార్ హీరోలను విలన్ గా మార్చేస్తున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ ను కూడా విలన్ గా మార్చాలి అనుకున్నాడట. ఆయన్ని విలన్ గా చూపించే సినిమా తీయాలి అనుకున్నాడట. ఏంటి ఇదేదో గాసిప్ అనుకుంటున్నారా..? ఇది నిజంగా నిజం. మరి.. నిజమే అయితే.. ఆ సినిమా ఏమైంది..? ఎందుకు పట్టాలెక్కలేదు..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా.?
లోకేష్ కనకరాజ్.. సరికొత్త కథలతో ఆడియన్స్ కి కొత్త తరహా ఎక్స్ పీరియన్స్ అందించే దర్శకుడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. ఖచ్చితంగా కొత్తదనం ఉంటుంది.. ఆడియన్స్ ని మెప్పిస్తుందా అనే నమ్మకాన్ని అందరిలో క్రియేట్ చేశాడు. అయితే.. ఈ యంగ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. స్టార్ హీరోలను విలన్లుగా మార్చేస్తున్నాడు. విక్రమ్ సినిమాలో సూర్యను రోలెక్స్ పాత్రలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో చూపించడం తెలిసిందే. కనిపించింది కొంచెం సేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో వావ్ అనిపించాడు. అలాగే విజయ్ సేతుపతిని, సంజయ్ దత్ ని తన సినిమాల్లో విలన్స్ గా చూపించాడు. Lokesh Kanagaraj’s movie Coolie.
ఇక అసలు విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు కూలీ సినిమా కథ కాకుండా వేరే కథ చెప్పాడట. ఆ కథలో రజినీకాంత్ ది విలన్ తరహా పాత్ర అట. ఆ కథ కూడా రజినీకి బాగా నచ్చిందట. ఆ సినిమా కూడా చేయాలి అనుకున్నాడట. అయితే.. ఆ కథతో సినిమా చేయడానికి కాస్త టైమ్ పడుతుందనే ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి ఆ కథను పక్కనపెట్టాడట. అప్పుడు కూలీ కథ చెప్పాడట. ఈ కథ విన్న వెంటనే రజినీకి విపరీతంగా నచ్చేసిందట. తలైవా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూలీని పట్టాలెక్కించాడట.
ఈ సినిమా కోసం టాలీవుడ్ కింగ్ నాగార్జునను విలన్ గా మార్చేసాడు. ఇందులో నాగ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా.. ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ తోనే అంచనాలు అమాంతం పెంచేశాడు. ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ అయితే.. అంచనాలు ఆకాశంలో కూర్చోవడం ఖాయం. ఈ సినిమా తర్వాత నాగార్జున కోసం కొత్త తరహా కథలు.. కొత్త తరహా పాత్రలను మేకర్స్ డిజైన్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఆగష్టు 14న కూలీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి.. కూలీతో లోకేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో.. నెక్ట్స్ ఇంకెవర్ని విలన్స్ గా పరిచయం చేస్తాడో చూడాలి.