పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ పై ‘కాంతార’ ఎఫెక్ట్.!

‘Kantara’ effect on ‘OG’: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ హవా చూస్తుంటే, విడుదల రోజే బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఈ మూవీ ప్రీ-సేల్స్ 1.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను తాకేయడం విశేషం. ఇదంతా ఒకపక్క అయితే… ఈ సినిమా లాంగ్ రన్ పై ‘కాంతార చాప్టర్ 1’ ప్రభావం పడుతుందా అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

నిజానికి అదే డేట్ కి రావాల్సిన బాలయ్య అఖండ 2 వాయిదా పడటంతో ఇక బాక్సాఫీస్ దగ్గర ఓజీకి ఎదురు లేదని అంతా అనుకున్నారు. కానీ ఈ నడుమ కాంతారా వచ్చింది. ‘ఓజీ’ వచ్చిన వారానికే అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ విడుదల కానుంది. 2022లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రిలీజ్ స్కేల్, థియేటర్ల లెక్క కూడా గణనీయంగా ఉంటుంది.

ఈ ప్రీక్వెల్‌కి వేరొక లెవెల్ బూస్ట్ ఏమిటంటే… ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నాడు. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను అక్టోబర్ 1న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలకానున్న ‘కాంతార చాప్టర్ 1’ మూవీలో ఈ ట్రైలర్‌ను స్క్రీన్ పై ప్రదర్శించనున్నట్లు సమాచారం.దాంతో, ప్రభాస్ ఫ్యాన్స్ రాజా సాబ్ ట్రైలర్‌ను థియేటర్లలో చూసేందుకు కాంతార చాప్టర్ 1 షోలకు వెళ్లే అవకాశముంది. ‘Kantara’ effect on ‘OG’.

ఇది సినిమా ఓపెనింగ్స్‌కి కాకపోయినా, ఓజీ లాంగ్ రన్ మీద ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది.ఓవర్సీస్‌లో ఇప్పటికే సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నా, ఇక లోకల్ బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ తన స్టార్ పవర్‌తో ఈ పోటీని ఎలా తట్టుకుంటాడో చూడాలి. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించగా, సంగీతం తమన్ అందిస్తున్నారు.