
Nagarjuna’s King 100: నాగార్జున కెరీర్‌లో అత్యంత కీలకమైన 100వ చిత్రం పట్టాలెక్కింది. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.రా. కార్తీక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ ప్రధానమైన చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. ఇది ఆయన వందో సినిమా కావడంతో, ఇతర నిర్మాణ సంస్థలను అనుమతించకుండా ఆయనే ఈ బాధ్యతను తీసుకున్నారు. సాధారణంగా సినిమా ప్రారంభోత్సవం రోజున హీరోయిన్ కూడా కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. కానీ, నాయిక ఎంపిక విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో లాంఛింగ్‌లో గ్లామర్ కనిపించలేదు.
ప్రస్తుతం ఈ సినిమాలో ప్రధాన కథానాయిక పాత్ర కోసం మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ పేరు బలంగా వినిపిస్తోంది. చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పాత్రకు కీర్తి సురేష్ సరైన ఎంపిక అని దర్శకుడు కార్తీక్ భావిస్తుండగా, నాయిక ఎంపిక విషయంలో నాగార్జున కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఎంపికపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Nagarjuna’s King 100.
సీనియర్ హీరోలతో పని చేసిన అనుభవం కీర్తి సురేష్‌కు ఉంది. ఆమె ఇప్పటికే చిరంజీవి, మహేష్, పవన్ కళ్యాణ్, నాని వంటి స్టార్ల పక్కన నటించింది. అంతేకాకుండా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నాగార్జునకు పర్ఫెక్ట్ జోడీ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.నాగార్జునతో కీర్తి సురేష్‌కి ఇది కొత్త పరిచయం కాదు. గతంలో నాగ్ హీరోగా నటించిన ‘మన్మధుడు 2’ లో ఆమె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. అప్పట్లో నాగార్జునే స్వయంగా కీర్తిని ఆ పాత్ర కోసం సంప్రదించారు. ఇప్పుడదే నటిని తన 100వ సినిమాకు జోడీగా ఎంచుకోవడం విశేషం.