కొరటాల నెక్స్ట్ హీరో అతనే..!

Koratala Siva Venkatesh: ఆచార్య’తో ఎదురుదెబ్బ తగిలినా.. ‘దేవర’ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు దర్శకుడు కొరటాల శివ. సాధారణంగా, ‘దేవర’కు సీక్వెల్ కూడా ఉండటంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ కూడా జూనియర్ ఎన్టీఆర్తోనే ఉంటుందని అందరూ ఊహించారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘దేవర 2’ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. నీల్ సినిమా పూర్తయ్యాక, ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ను లేదా దాదాసాహెబ్ బయోపిక్‌ను లైన్‌లో పెట్టే అవకాశం ఉంది.

దీంతో, కొరటాల శివ ప్రస్తుతానికి ‘దేవర 2’ ను పక్కన పెట్టి, ఇతర అగ్ర హీరోల కోసం కథలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల, ఆయన అక్కినేని హీరో నాగ చైతన్యకు కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారని, ఆ తర్వాత బాలకృష్ణ కోసం కూడా ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసి త్వరలో వినిపించబోతున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో కొరటాల తదుపరి చిత్రం చైతూ లేదా బాలయ్యలలో ఒకరితో ఉంటుందని అనుకున్నారు.

అయితే కొరటాల శివ ఆ ఇద్దరు హీరోలతో కాకుండా విక్టరీ వెంకటేష్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న వెంకటేష్ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన ఇప్పుడు చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. దీనితో పాటు, త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టుల తర్వాత, వెంకటేష్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెంకటేష్‌ ఇమేజ్‌కు సరిపోయే విధంగా కొరటాల ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, అతి త్వరలోనే ఈ కలయికకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. Koratala Siva Venkatesh.

నిజానికి, కొరటాల బాలకృష్ణ కోసం ఒక పొలిటికల్ జానర్ స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ, బాలయ్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉండటం, అవి పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో, కొరటాల ముందుగా వెంకటేష్‌తో సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ‘దేవర-2’ లేదా బాలయ్యతో సినిమా లైన్‌లోకి వచ్చే అవకాశం ఉంది.