
Krish About Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు సినిమా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజైన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకి దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా క్రిష్ కనిపించలేదు. దీంతో ఎందుకు ఈ మూవీ ప్రమోషన్స్ లో క్రిష్ కనిపించలేదు..? అసలు ఎందుకు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసారు..? ఇదిలా ఉంటే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్.. క్రిష్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. అయితే.. పవన్ తో క్రిష్ కు క్రియేటీవ్ డిఫరెన్సస్ రావడం వలనే బయటకు వచ్చేసారా అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉంటే.. క్రిష్ ఈ సినిమాకి సంబంధించి తన మనసులో మాటలు బయటపెట్టారు. ఇంతకీ.. క్రిష్ చెప్పారు..? పవన్ ఏమన్నారు..?
ఈ సినిమా కాన్సెప్ట్ తన దగ్గరకు తీసుకువచ్చిన క్రిష్ కు థ్యాంక్స్ అని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేశారు. దీంతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న క్రిష్ తన మనసులో మాటలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. ఇంతకీ క్రిష్ ఏం చెప్పారంటే.. పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారి వలనే ఈ వీరమల్లు సినిమా అనేది సాధ్యమైందని.. వారు సినిమాల్లోనే కాదు… నిజ జీవితంలోనూ ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పారు క్రిష్. ఎంతో ఉత్సాహాన్నిచ్చిన ప్రాజెక్టులలో ఈ సినిమా ఒకటి. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. దర్శకుడిగా మాత్రమే కాకుండా.. ఈ సినిమా కథను రూపొందించడంలోనూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుందని క్రిష్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
వీరమల్లు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రిష్ ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. సినిమా పై ఆయన తొలిసారి స్పందించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రెస్ మీట్ అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో క్రిష్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రిష్ గారు మంచి కాన్సెప్ట్‌తో తనను సంప్రదించారని, ఆయన చెప్పిన కథ ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసలు కురిపించారు. ఈ విధంగా హరిహర వీరమల్లు బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సుదీర్ఘ మెసేజ్ పోస్ట్ చేశారు. అందులో పేరు పేరునా పేర్కొన్న క్రిష్ తన నుంచి బాధ్యత తీసుకున్న జ్యోతికృష్ణని ప్రస్తావించలేదు. Krish About Hari Hara Veeramallu.
దీంతో క్రిష్, జ్యోతికృష్ణ మధ్య ఏమైనా డిఫెరెన్స్ వచ్చాయా అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. ఏది ఏమైనా క్రిష్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. గమ్యం సినిమా నుంచి తన టాలెంట్ ఎలాంటిదో.. ఎలాంటి సినిమాలు అందించాలని తపిస్తుంటాడో అందరికీ తెలుసు. అయితే.. ఈ సినిమా నిర్మాణానికి ఎక్కువ టైమ్ పట్టడం.. ఎప్పుడు పూర్తవుతుందో అప్పటి పరిస్థితుల్లో ఎవరూ చెప్పలేని పరిస్థితుల్లో ఉండడం వలన ఆయన తప్పుకున్నారు. ఏదైతేనే వీరమల్లు థియేటర్స్ లోకి వస్తుంది. మరి.. అంచనాలను మించిన సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం..