
Madonna Sebastian in Spirit: ‘యానిమల్’ తర్వాత సందీప్ వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల క్రితమే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, ప్రభాస్ గత సినిమాల షూటింగ్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. ఇక ఫైనల్‌గా నవంబర్ 5న ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తాజా సమాచారం. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఆయన పాత్ర కూడా సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక హీరోయిన్ ఎంపిక విషయంలోనూ సినిమా ఎప్పటికప్పుడు మార్పులు చవిచూస్తోంది. మొదట దీపిక పదుకొణెను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె పెట్టిన కొన్ని షరతులు డైరెక్టర్ సందీప్ వంగాకి నచ్చక, ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టు వార్తలు వచ్చాయి. అనంతరం దీపిక స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ తృప్తి దిమ్రిని తీసుకున్నారు. తాజాగా మరో మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ కూడా ‘స్పిరిట్’లో చేరినట్టు సమాచారం. మొదట ఈ పాత్రకు బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్‌ను అనుకున్నప్పటికీ, చివరికి ఆమె స్థానంలో మడోన్నాను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర హీరోయిన్గా అయి ఉండొచ్చా, లేక ప్రతినాయకురాలిగానా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
మడోన్నా విషయానికి వస్తే… ఆమె మలయాళ సూపర్‌హిట్ మూవీ ‘ప్రేమమ్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత తమిళం, తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘ప్రేమమ్’ రీమేక్‌లో నాగచైతన్యతో కలిసి నటించగా, తరువాత ‘శ్యామ్ సింగరాయ్’లోనూ కనిపించారు. తలపతి విజయ్ చిత్రం ‘లియో’లో కూడా నటించింది. అయితే ‘శ్యామ్ సింగరాయ్’ తర్వాత తెలుగులో ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాతో మళ్లీ తెలుగులోకి అడుగుపెడుతుండటంతో, ఇది మడోన్నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ లో ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. సందీప్ వంగా చిరంజీవికి పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన ఆఫీస్‌లో చిరు ఫోటో వైరల్ అయిన సంగతి మరవలేం. వంగా చిరుతో సినిమా చేయాలన్న ఆసక్తి ‘అర్జున్ రెడ్డి’ సమయంలో నుంచే ఉందని అప్పటి నుంచే చర్చలు సాగుతున్నట్టు టాక్ ఉంది. Madonna Sebastian in Spirit.
‘స్పిరిట్’లో తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని, ఇది ‘యానిమల్’లో అనిల్ కపూర్ పాత్రకు సమానమైనదిగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాంటి పాత్రకు చిరంజీవి అయితే కరెక్ట్ ఫిట్ అవుతారని వంగా భావించి చిరుతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇది నిజమైతే థియేటర్లలో సందడి మొదలవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.