
Mahesh Babu Sandeep Reddy Vanga Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘SSMB29’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అంతర్జాతీయంగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోంది. హాలీవుడ్ స్థాయిలో నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే రాజమౌళి ప్రాజెక్టు లాంటి గొప్ప అవకాశాన్ని అందుకున్న మహేష్, తదుపరి సినిమాకు కూడా అదే స్థాయి క్రేజ్ కలిగిన దర్శకుడిని ఎంచుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్. తాజా సమాచారం మేరకు, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి హిట్ సినిమాలతో గుర్తింపు పొందిన సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు తన తదుపరి సినిమా చేయనున్నారని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టును ప్యాన్ ఇండియా స్థాయిలో ఏషియన్ సునీల్, సందీప్ వంగా కలిసి నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. సందీప్ ఇప్పటికే మహేష్ కోసం ఓ ఇంటెన్స్, కొత్త కాన్సెప్ట్‌తో స్క్రిప్ట్ రెడీ చేయగా, ఆ కథను మహేష్ విన్నారని, కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. ప్రాజెక్ట్ అధికారికంగా ఫైనల్ కాకపోయినా, దీనిపై సినీ వర్గాల్లో చర్చ మొదలైపోయింది.
మహేష్ బాబు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ‘SSMB29’ తాజా షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇటీవలే ఆఫ్రికాలోని నైరోబీలో ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. లీక్‌లకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య షూటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఈ షెడ్యూల్‌లో కాశీ క్షేత్రం ఆధారంగా రూపొందించిన ఓ భారీ సెట్‌పై కీలక సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ భాగం అక్టోబర్ 10 వరకు సాగనుందని సమాచారం. Mahesh Babu Sandeep Reddy Vanga Movie.
ఇప్పటికే ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లే ప్రాజెక్టుగా SSMB 29 రూపుదిద్దుకుంటోంది. ఈసారి ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఇంగ్లీష్ ఆడియెన్స్ను కూడా టార్గెట్ చేశారు. దీనికి తగ్గట్టుగానే చిత్ర బృందం హాలీవుడ్ నుంచి టాప్ లెవల్ టెక్నీషియన్లను నియమించుకుని, ప్రతీ విభాగాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తీర్చిదిద్దుతోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే కాకుండా, భారత సినిమా చరిత్రలో నిలిచిపోయే ఓ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించేందుకు జక్కన్న సిద్ధమవుతున్నాడు.