సరికొత్త రికార్డ్ సెట్ చేస్తోన్న సూపర్ స్టార్…?

Mahesh’s Athadu re-release: సూపర్ స్టార్ మహేష్‌ బాబు కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి అతడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అతడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అయ్యింది. మహేష్‌ బాబు అభిమానులు కొత్త సినిమాను చూడడానికి ఎదురు చూస్తున్నట్టుగా ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. అలాగే మహేష్ సరికొత్త రికార్డ్ సెట్ చేయబోతున్నాడనే వార్త కూడా వినిపిస్తోంది. మరి.. ఎస్ఎస్ఎంబీ 29 అప్ డేట్ ఏంటి..? మహేష్‌ సెట్ చేసే రికార్డ్ ఏంటి..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..?

పాత సినిమాలను కొత్తగా రిలీజ్ చేయడం అనేది ఓ ట్రెండ్ గా మారింది. అదే.. రీ రిలీజ్. పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా అతడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే సేల్ అయిపోయాయి అంటే.. ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ రీ రిలీజ్ లో ఫస్ట్ డేనే 3 కోట్ల వరకు కలెక్ట్ చేయవచ్చని.. రీ రిలీజ్ లో అతడు సరికొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఎస్ఎస్ఎంబీ 29 అప్ డేట్ విషయానికి వస్తే.. రాజమౌళి ఏమాత్రం అప్ డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. లేటెస్ట్ గా బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా కోసం ఇంటర్వెల్ ఎపిసోడ్ ను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం ఓ లోయలో జరుగుతుందని.. ముఖ్యంగా ఫారెస్ట్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని.. హాలీవుడ్ రేంజ్ లో ఈ ఎపిసోడ్ ను జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మహేష్‌ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా డిజైన్ చేశారని సమాచారం. Mahesh’s Athadu re-release.

ఈ సినిమాకి పాన్ ఇండియా స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత రాసిన పుస్తకాలు ఆధారంగా ఈ సినిమా కథను రెడీ చేశారని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా విజయేంద్రప్రసాద్ చాలా సార్లు మీడియాకి చెప్పడం జరిగింది. ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి దేవ కట్టా డైలాగ్స్ రాస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను మహేష్‌ బర్త్ డేకి ఇస్తారా ఇవ్వరా అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. జక్కన్న ఏం చేస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/why-did-hrithik-roshan-appreciate-ntr-checkout-the-full-story/