రాజాసాబ్ కి రెండు ట్రైలర్లు.. ఫ్యాన్స్ కి పండగే.!!

Two Trailers For Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమాపై పెరిగిన హైప్‌కు తోడు, ఇప్పటివరకు వచ్చిన టీజర్, పోస్టర్లు ఈ ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. డార్లింగ్ అభిమానులే కాదు, మొత్తం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం మారుతీ దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో తొలిసారిగా ముగ్గురు కథానాయికలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఆ ముద్దుగుమ్మలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కాగా, మరో స్టార్ హీరోయిన్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ప్రభాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని తొలుత డిసెంబర్‌లో విడుదల చేయాలన్న యాజమాన్యం భావించినా, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమాను సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న రాజాసాబ్.. ఫుల్ స్వింగ్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. Two Trailers For Rajasaab.

ఇక తాజా అప్డేట్ ప్రకారం, నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించిన వివరాలు అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేశాయి. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అక్టోబర్ 23న, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ తొలి పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాదు, అక్టోబర్ 2న విడుదల కానున్న ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాతో పాటు, రాజాసాబ్ థియేట్రికల్ ట్రైలర్ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత, ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మరో ప్రత్యేకమైన ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారని చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం రాజా సాబ్ కోసం రెండు ట్రైలర్స్ ను రెడీ చేస్తినట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రైలర్, సాంగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.