
Megastar Manchu Manoj: ‘మిరాయ్’ సినిమా మంచు మనోజ్ కెరీర్‌ను మలుపుతిప్పే టర్నింగ్ పాయింట్‌గా మారింది. సినీ ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న మనోజ్, తన రెండో పెళ్లి తరువాత జీవితం పట్ల కొత్త దృష్టితో ముందుకు అడుగులు వేసాడు. ఇప్పుడు అదే ఊపుతో తన కెరీర్‌ను మరోసారి బలంగా రీబిల్డ్ చేస్తున్నాడు. ‘మిరాయ్’ సినిమాతో మనోజ్ తనను తాను మళ్లీ పరిచయం చేసుకున్నాడు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ చిత్రంలో మహాబీర్ లామా అనే బలమైన ప్రతినాయకుడిగా మనోజ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మిరాయ్ సినిమాలో తేజ కంటే ఎక్కువగా మనోజ్‌కి ప్రశంసలు దక్కినట్టు సోషల్ మీడియా రియాక్షన్స్ చెబుతున్నాయి. దాదాపు దశాబ్దం తరువాత వెండితెరపై అడుగుపెట్టిన మనోజ్, ఈ పాత్ర ద్వారా నటన పరంగా తన లోని కొత్త కోణాన్ని చూపించాడు. ఈ సినిమాలోని విలన్ రోల్‌కి వచ్చిన స్పందనతో మనోజ్‌కు కొత్తగా అవకాశాలు తలుపుతడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ఓ భారీ మాస్ యాక్షన్ చిత్రంలో విలన్‌గా మంచు మనోజ్ ఎంపికయ్యాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ ఫేమ్ బాబీ కొల్లి తో చిరంజీవి తన రెండో సినిమాని ఇటీవలే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా.. ఈ సినిమాకు కెమెరామెన్‌గా మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని వ్యవహరిస్తుండటంతో, మనోజ్‌ను ఈ ప్రాజెక్ట్‌లో విలన్‌గా తీసుకోవాలనే ఆలోచన బలంగా వచ్చినట్టు తెలుస్తోంది. Megastar Manchu Manoj.
బాబీ దృష్టిలో ఈ విలన్ పాత్రకు ఓ గట్టి ప్రెజెన్స్ అవసరమై, మిరాయ్‌లో మనోజ్ ప్రదర్శించిన పవర్‌ఫుల్ నటనను బట్టి ఆయనను ఎంపిక చేసినట్టు సమాచారం. ఒకప్పుడు మోహన్ బాబు, చిరంజీవి సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని కుమారుడు మనోజ్, చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడంటే ఇది ఓ రేర్ మోమెంట్ అని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.