మంచు విష్ణు మరో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడా..?

Manchu Vishnu Project Ramayana: మంచు విష్ణు కన్నప్ప సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం పక్కనపెడితే.. విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది. అందరికీ మంచి పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాని సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా అభినందించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మంచు విష్ణు మరో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నారనే వార్త ప్రచారం జరుగుతుంది. ఈసారి ఏ సినిమా చేయబోతున్నారు..? అందులో ఎవరెవరు నటించనున్నారు..? అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే.

క‌న్న‌ప్ప సినిమా త‌ర్వాత ఇంత వరకు విష్ణు కొత్త సినిమా ఏంటి అనేది ప్రకటించలేదు. అయితే.. తన మనసు రామాయణం పై పడిందని తెలిసింది. రామాయణం స్క్రీప్ట్ రెడీగా ఉందని.. 2009లోనే రాముడుగా సూర్యను నటించమని అడిగానని కాకపోతే బడ్జెట్ కారణంగా అప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదని చెప్పారు. అయితే.. ఇప్పుడు కన్నప్ప ఇచ్చిన ఉత్సాహంతో ఆ సినిమా కథను తెర పైకి తీసుకురావాలని తపిస్తున్నాడట. ఇందులో రాముడుగా సూర్య నటిస్తే.. సీతగా ఆలియా భట్, లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్‌ రామ్, హనుమంతుడు తాను నటిస్తానని.. రావణాసురుడిగా తన తండ్రి మోహన్ బాబు నటించాలని అనుకున్నట్టుగా విష్ణు తెలియ చేశారు. Manchu Vishnu Project Ramayana.

విష్ణు ప్లాన్ మామూలుగా లేదు. ఆయన చెప్పిన నటీనటులతో సినిమా ఊహించుకుంటేనే వావ్ అనిపిస్తుంది. కన్నప్ప సినిమా కోసం బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ ఇలా భారీ తారాగణాన్నే రంగంలోకి దించారు. ఇప్పుడు రామాయణం కోసం తలుచుకుంటే.. వీళ్లని రంగంలోకి దింపడం అంత కష్టమేమీ కాదు. ఈ వార్త ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి రాముడుగా సూర్య అయితే హైట్ తక్కువుగా కనిపిస్తాడేమో అనే కామెంట్లు వస్తున్నాయి. దీనికి అలాంటిది ఏమీ ప్రాబ్లమ్ ఉండదు.. వీఎఫ్ఎక్స్ తో మేనేజ్ చేయచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ప్రభాస్ తో ఆదిపురుష్ అనే సినిమా వచ్చిందనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి రాముడు సీతగా రామాయణం రూపొందుతోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 2026 దీపావ‌ళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావ‌ళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు డివోషనల్ ట్రెండ్ నడుస్తుంది. అందుచేత డివోషనల్ టచ్ తో ఎన్ని సినిమాలు వచ్చినా జనాలు చూస్తారు. విష్ణు అనుకున్నట్టుగా రామాయణం వస్తే.. ఖచ్చితంగా జనాలు చూస్తారు. మరి.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/power-star-pawan-kalyan-stepped-into-the-field-to-promote-the-movie-veeramallu/