బాక్సాఫీస్ షేక్ చేయనున్న ముగ్గురు మొనగాళ్లు..!

Vishwambhara OG And Peddi: మెగా హీరోల సినిమాలంటే ఫ్యాన్స్ కి యమా క్రేజ్. అందుకనే రానున్న తమ హీరోల సినిమాల పై చాలా ఆశలు పెట్టుకున్నారు. వీరమల్లు సూపర్ హిట్ తో జోష్ లో ఉన్న అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడానికి మెగా హీరోలు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఇప్పటి నుంచే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. అంతకు మించి అనేలా కలెక్షన్ల వర్షం కురిపించడానికి.. సరికొత్త రికార్డులు సృష్టించడానికి ముగ్గురు మొనగాళ్లు రెడీ అవుతున్నారు. ఇంతకీ.. ఆ ముగ్గురు మొనగాళ్లు ఎవరు..? వచ్చేది ఎప్పుడు..?

ముగ్గురు మొనగాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. ఆయన నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ సినిమాకి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్. భారీ సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతోన్న విశ్వంభర ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ఇటీవల ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. దీంతో దాదాపు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా కంటే ముందుగా చిరు నటించిన భోళా శంకర్ ప్లాప్ అయ్యింది. అందుకనే ఈసారి బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో ఉన్నారు మెగాస్టార్. ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Vishwambhara OG And Peddi.

ఇక మెగాస్టార్ తర్వాత చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి. ఆయన నటించిన హరి హర వీరమల్లు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రత్యర్థి శిబిరాల నెగిటివ్ టాక్ ను తట్టుకుని నిలబడగలిగింది. అయితే పవన్ నుంచి మరింత ఎక్స్ట్రా జోష్ ను ఆశిస్తున్న ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు ఓజీ సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇది ఒక గ్యాంగ్ స్టర్ మూవీ. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అమాంతం అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ తర్వాత చెప్పుకోవాల్సింది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి. ఆయన తాజాగా నటిస్తున్న మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో పెద్ది సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కంటే ముందుగా చరణ్‌ నటించిన గేమ్ ఛేంజర్ నిరాశపరిచిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు రామ్ చరణ్. ఇందులో చరణ్‌ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 27న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇలా ముగ్గురు మొనగాళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ రాబోతున్నారు. మరి.. ఈ ముగ్గురు మొనగాళ్లు ఏ రేంజ్ సక్సెస్ అందిస్తారో..తమ ఫ్యాన్స్ ఆకలి ఏ విధంగా తీరుస్తారోచూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/dil-raju-is-waiting-for-the-results-of-vijay-deverakondas-new-movie-kingdom-because-the-movie-has-huge-expectations/