
Megastar’s Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ విశ్వంభర. ఈ ఇయర్ లో సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు కానీ.. విడుదల కాలేదు. వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడం వలన ఆలస్యం అవుతుంది. ఇదిగో విశ్వంభర వచ్చేస్తుంది అంటూ ప్రచారం జరగడమే కానీ.. ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేదు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్. ఇదిలా ఉంటే.. ఈ మూవీ కోసం ఓ సాంగ్ రీమిక్స్ చేయనున్నారనే వార్త లీకైంది. ఇంతకీ.. ఆ సాంగ్ ఏంటి..? ఈ రీమిక్స్ సాంగ్ లో నటించే బ్యూటీ ఎవరు..?
ఈ క్రేజీ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. ఓ సాంగ్ రిలీజ్ చేయడం.. ఆ సాంగ్ విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. అయితే.. ఐటం సాంగ్ పెండింగ్ వుంది. ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియోను రంగంలోకి దింపారని తెలిసింది. ఈ ఐటం సాంగ్ ఎవరితో చేయనున్నారంటే. బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ పేరు వినిపిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో ఐటం సాంగ్ చేయించాలనే ఐడియా మెగాస్టార్ చిరంజీవిదే అని వార్తలు వస్తున్నాయి.
అయితే.. చిరంజీవి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలా సాంగ్ ని రీమిక్స్‌లా ట్యూన్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 50 శాతం ట్యూన్ మార్చడంతో పాటు, లిరిక్స్ సైతం మార్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో సాంగ్ విన్నప్పుడు కొత్తగా ఫీల్ అవ్వడంతో పాటు, ఈతరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ ఆలోచన బాగుందని సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ నడుస్తోంది. అప్పట్లో ఆట కావాలా.. పాట కావాలా.. సాంగ్ ఓ ఊపు ఊపేసంది. ఇప్పుడు ఆ సాంగ్ ను మార్పులు చేర్పులుతో రీమిక్స్ చేస్తే.. మళ్లీ ఊపేయడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు. Megastar’s Vishwambhara.
విశ్వంభర రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడం వలనే రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మేకర్స్ ప్రకటించడం లేదు. పైగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని స్వయంగా మెగాస్టార్ చెప్పడంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరు, త్రిష చాలా గ్యాప్ తర్వాత కలిసి నటించడం.. బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత మల్లిడి వశిష్ట్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం.. ఫస్ట్ సింగ్ కు అనూహ్యమైన స్పందన రావడంతో విశ్వంభర పై పాజిటివ్ బజ్ ఉంది. ఆలస్యం అయితే.. సినిమా పై ఆసక్తి తగ్గే ఛాన్స్ ఉంది. మరి.. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.