పవర్ స్టార్ తో మెహర్ రమేష్ సినిమా?

Meher Ramesh’s film with Power Star: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పొలిటికల్ గా బిజీ అయిన తర్వాత సినిమాలు చేయడం చాలా కష్టమౌతుంది. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేయడానికే చాన్నాళ్లు వెయిట్ చేయాల్సివచ్చింది. ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా అంటే డౌట్. అయితే.. పవన్ మాత్రం తన పార్టీని నడపడానికి డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చేస్తానని చెప్పారు. చెప్పడం అయితే.. చెప్పారు కానీ.. వాస్తవంగా చూస్తే.. కాస్త కష్టమే అని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెహర్ రమేష్‌.. పవన్ కళ్యాణ్ తో ఖచ్చితంగా సినిమా చేస్తానని ప్రకటించారు. మరి.. పవన్, మెహర్ కాంబో మూవీ సాధ్యమేనా..?

డైరెక్టర్ మెహర్ రమేష్.. ఈ పేరు వినగానే సినీ అభిమానులు అయ్య బాబోయ్ అని షాక్ అవుతారు. ఎందుకంటే ఆయన అలాంటి సినిమాలు తెరకెక్కించారు. ఎవరూ కావాలని డిజాస్టర్ సినిమాలు చేయరు.. బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలనే అనుకుంటారు. అయితే.. మెహర్ రమేష్ కు కాలం కలిసి రాలేదు. ఆయన తీసిన సినిమాలు ఆయ హీరోలకు డిజాస్టర్స్ గా మారాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శక్తి అనే ఆల్ టైమ్ డిజాస్టర్ అందించాడు. ఆ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తో షాడో అనే మరో డిజాస్టర్ అందించాడు. ఆతర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ అనే మరో డిజాస్టర్ అందించాడు.

ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తాను అంటున్నాడు. ఇదేదో ఎవరూ ఊహించి రాసింది.. చెప్పింది కాదు.. స్వయంగా మెహర్ రమేషే ఓ ఇంటర్ వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ఖచ్చితంగా తీస్తానని ప్రకటించాడు. మెహర్ ఇలా పవర్ స్టార్ తో సినిమాని ప్రకటించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ ఇంటర్ వ్యూలో ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని చెప్పడంతో పవన్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఆయన అంత నమ్మకంగా చెప్పడం చూస్తుంటే.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యిందా అనే డౌట్ వస్తుంది.

మెహర్ రమేష్‌.. మెగా ఫ్యామిలీకి బంధువు. అందుకనే ఆయన వరుసగా డిజాస్టర్స్ తీసినా మెగాస్టార్ భోళా శంకర్ అనే సినిమా తీసే ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు. చిరంజీవి గారితో సినిమా తీయాలి అనుకున్నాను తీసాను.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ గారితో సినిమా తీయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. ఇంత గట్టిగా చెబుతున్నారు.. సినిమా ఫిక్స్ అయ్యిందా అంటే.. సినిమా ఫిక్స్ అవ్వలేదు.. నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పడం ఆసక్తిగా మారింది. పవన్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి.. మెహర్ రమేష్ నమ్మకం నిజం అవుతుందా..? పవన్ తో సినిమా చేస్తారా…? లేదా..? మరింత క్లారిటీ రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/cinema/this-is-the-secret-of-the-nagarjuna-song-in-coolie-nag-who-played-the-villain-in-the-movie-coolie/