ఒకే బాటలో నాగ్, చైతూ..?

Nagarjuna and Chaitu’s Milestone films: టాలీవుడ్ కింగ్ నాగార్జున, యువ సమ్రాట్ నాగచైతన్య.. ఈ తండ్రీ కొడుకులిద్దరూ ఫామ్ లోకి వచ్చేశారు. దీంతో ఇప్పుడు సినిమాల విషయంలో మరింతగా దూకుడు పెంచబోతున్నారు. తండేల్ సినిమాతో చైతూ బ్లాక్ బస్టర్ సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరితే.. కుబేర సినిమాతో నాగార్జున బ్లాక్ బస్టర్ సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరారు. అయితే.. ఇప్పుడు నాగ్, చైతూ ఇద్దరూ కూడా ఒకే బాటలో నడవబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. నాగ్, చైతూ ఒకే బాటలో ఏం చేయబోతున్నారు..?

థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ.. ఇలా వరుస ఫ్లాపుల్లో ఉన్న చైతన్యకు తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే 100 కోట్లు కలెక్ట్ చేసింది. అన్నింటికంటే ఎక్కువుగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి కంటే ఎక్కువుగా నాగచైతన్య పర్ ఫార్మెన్స్ కే ఎక్కువ పేరు వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా వెండి తెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం విశేషం. టీఆర్పీ రేటింగ్ లో టాప్ త్రి ప్లేస్ లో తండేల్ సినిమా నిలవడం విశేషం. Nagarjuna and Chaitu’s Milestone films.

ఇప్పుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగచైతన్య భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. అయితే.. ఈ సినిమా తర్వాత చైతూ కోలీవుడ్ డైరెక్టర్ మిత్రన్ తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో చైతన్య క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

అయితే.. చైతన్య కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుకున్నట్టుగానే.. నాగార్జున కూడా కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. నాగ్ తన కెరీర్ లో సెంచరీ అనే మైలురాయికి చేరుకున్నారు. ఈ సినిమాకి కోలీవుడ్ డైరెక్టర్ ని ఎంచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ క్రేజీ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారని సమాచారం. ఇలా.. నాగార్జున, నాగచైతన్య.. ఇద్దరూ ఒకే బాటలో నడుస్తూ.. కోలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తుండడం విశేషం. మరి.. ఈ తండ్రీకొడుకులు కోలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/thandel-which-collected-100-crores-on-the-silver-screen-and-chaitanya-who-created-a-sensation-with-thandels-trp-rating/