జపాన్ లో నాగ్ కు ఇంత క్రేజ్ ఉందా..?

Nagarjuna’s Japanese Fans ‘Naga-sama’: టాలీవుడ్ కింగ్ నాగార్జున తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చిపెడుతున్నారు. జపాన్ లో సినీ అభిమానులు నాగార్జునను నాగ్ – సామా అంటూ పిలుస్తుండడం విశేషం. ఇంతకీ నాగ్ సామా అంటే ఏంటి..? ఇప్పుడు జపాన్ లో నాగార్జునకు ఈ రేంజ్ లో క్రేజ్ ఏర్పడడానికి కారణం ఏంటి..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడాల్సిందే..

జపాన్ సినీ అభిమానులు తెలుగు సినిమాల పై ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలిసిందే. తెలుగులో వచ్చిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలను విశేషంగా ఆదరించారు. మన స్టార్స్ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా విడుదలైన తర్వాత నాగార్జునకు అక్కడ ప్రత్యేకమైన క్రేజ్ పెరిగింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన అనీష్ శెట్టి పాత్రను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమాలో నాగ్ స్టైలీష్ లుక్ అక్కడ జనాలను బాగా ఆకట్టుకుంది. ఆతర్వాత ఇప్పుడు కుబేర సినిమా రిలీజ్ అవ్వడంతో అక్కడ నెటిజన్లు, సినీ అభిమానులు సోషల్ మీడియాలో #NagSama అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలెట్టారు.

అసలు నాగ్ సామా అంటే ఏంటంటే.. జపాన్ సంస్కృతిలో సామా అనే పదాన్ని చాలా గౌరవంగా ఉపయోగిస్తారట. ఇంకా చెప్పాలంటే.. దేవుళ్లు, రాజులు.. ఇలా గొప్ప వ్యక్తులకి మాత్రమే ఈ ట్యాగ్ ఉపయోగిస్తారని తెలిసింది. నాగార్జునను నాగ్ – సామా అని పిలవడం బట్టి అక్కడ అభిమానులు ఆయనను ఎంతలా గౌరవిస్తున్నారో తెలుస్తుంది. నాగ్ సామా స్క్రీన్ పై ఉంటే చాలు ఆయన కోసమే సినిమా చూస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో జపాన్ సినీ అభిమానులు రాస్తున్నారు. కుబేర సినిమాలో దీపక్ పాత్రలో నటించడం కాదు.. జీవించారని చెప్పచ్చు. ఇది నాగ్ కు అక్కడ మరింత ఫ్యాన్ బేస్ పెరగడానికి కారణం అని చెప్పచ్చు. Nagarjuna’s Japanese Fans ‘Naga-sama’.

నాగార్జున ఫోటోలను జపాన్ లో చాలా మంది వాల్ పేపర్ గా పెట్టుకుంటున్నారు. కుబేర సినిమాను నాగ్ సామా కోసం మళ్లీ మళ్లీ చూస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెక్ట్స్ రజినీకాంత్ సినిమాలో నాగార్జున నటించిన విషయం తెలిసిందే. అక్కడి ఫ్యాన్స్ కూలీ లిరికల్ సాంగ్ చూసి వావ్, నాగ్-సామా ఈ సినిమాలో ఉన్నారా? ఇది వెరీ స్పెషల్’ అంటూ ఫుల్ ఎగ్జైట్‌మెంట్ అవుతున్నారు. ఇక పై జపాన్ లో నాగార్జున మరింత పాపులర్ అవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ టైమ్ లోనాగార్జునకు జపాన్ లో క్రేజ్ రావడం తెలుగు సినిమాకి మరింత గర్వకారణం. ఈ క్రేజ్ చూస్తుంటే.. నాగార్జున నటించిన పాత సినిమాలను జపాన్ లో రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/mega-power-stars-are-sure-to-shake-up-the-box-office-mega-fans-have-high-hopes-for-the-films-vishwambhara-og-and-peddi/