
NTR’s Bollywood movie War 2: సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్.. వీరిద్దరూ కలిసి నటించిన మూవీ వార్ 2. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఎన్టీఆర్ నటించిన డైరెక్ట్ బాలీవుడ్ మూవీ ఇది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో వెనకబడడం.. ఏపీ మినిష్టర్ నారా లోకేష్ కూలీ సినిమాకి సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. దీంతో ఎన్టీఆర్ సినిమాని పట్టించుకోవడం లేదా..? కావాలనే పక్కనపెట్టారా..? ఇలా అనేక ప్రశ్నలు. అందుకనే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలా మాట్లాడాడు అనే డౌట్ కూడా వచ్చింది. అయితే.. పరిస్థితి అర్థం చేసుకున్న అభిమానులు మాత్రం అండగా నిలిచారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో ఎన్టీఆర్ అంటే ఏంటో తెలిసింది. దేవర అనే సినిమాకి నెగిటీవ్ టాక్ వచ్చినా.. అభిమానులు అండగా నిలిచి సక్సెస్ అందించారు. 500 కోట్లు కలెక్ట్ చేసేలా చేశారు. అలాంటి హీరో ఒక బాలీవుడ్ అగ్ర హీరో సినిమాలో మరో స్టార్ గా నటించడం వల్ల లాభం సంగతి ఎలా ఉన్నా బాక్సాఫీస్ పోటీలో కొంత ఇబ్బంది ఉంటుంది. అభిమానులు పూర్తిగా సినిమాని సొంతం చేసుకోరు. ఎందుకంటే.. ఇది తమ హీరో సోలో హీరోగా చేసిన సినిమా కాదు. పైగా ఈ సినిమాలో హీరోయిన్ లేదు. గ్లామర్ పాట లేదు తమ హీరోకి. దానికితోడు రజినీకాంత్ సినిమా పై విపరీతమైన హైప్ ఉంది.
అడ్వాన్స్ బుకింగ్ లలో కూలీ హవా ఉంది. ఇలాంటి సమయంలో ఏ హీరోకైనా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ.. ఎన్టీఆర్ కి వార్ 2 మీద విపరీతమైన నమ్మకం ఉంది. అంతే కాదు, ఇప్పటికే ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ కాలర్ ఎగిరేశాడు. అనూహ్యంగా ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 విషయంలో హీరోకి అండగా నిలిచారు. కూలీకి ధీటుగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. తెలుగునాట వార్ 2 కు మంచి ఓపెనింగ్ వచ్చింది అంటే కారణం అభిమానులే. ఈ సినిమాకి అభిమానులు అండగా నిలవకపోతే ఈ రేంజ్ లో ఓపెనింగ్ వచ్చేది కాదు. NTR’s Bollywood movie War 2.
సోషల్ మీడియాలో వార్ 2 మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో వెనబడిందనే టాక్ వచ్చింది. అయితే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎన్టీఆర్ హిందీలో హృతిక్ తో సినిమా చెయ్యాలని నిర్ణయాన్ని తాము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ కు అభిమానులు అండగా నిలిచి మేమున్నాం అనే ధైర్యాన్ని ఇస్తున్నారు.