
OG And Veeramallu: పవర్ స్టార్ నటించిన వీరమల్లు, ఓజీ.. ఈ రెండు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల్లో ఓజీకే ఎక్కువ క్రేజ్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వీరమల్లు 24న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ రెండు సినిమాల క్రేజ్ గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణకు ఓ ఇటర్ వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి తనదైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ.. వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఏం చెప్పారు..? ఈ రెండు సినిమాల క్రేజీ సీక్రెట్స్ ఏంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రెండు నెలల గ్యాప్ లో రెండు భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నెల 24న హరి హర వీరమల్లు వస్తుంటే.. సెప్టెంబర్ 25న ఓజీ సినిమా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు ప్రత్యేకమైనవి. వీరమల్లు, ఓజీ.. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ క్రేజ్ ఉందంటే.. ఓజీకే అని చెబుతున్నారు సినీ జనాలు. సోషల్ మీడియాలో ఇలాగే ప్రచారం జరుగుతుంది. ట్రేడ్ వర్గాల్లో ఓజీ సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాని ఎంత ఎక్కువ రేటు చెప్పినా కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ సై అంటున్నారు. ఈ క్రేజీ మూవీని సుజిత్ తెరకెక్కిస్తే.. డీవీవీ దానయ్య నిర్మించారు. OG And Veeramallu.
వీరమల్లు సినిమాకి కూడా మంచి హైప్ ఉండేది కానీ.. బాగా లేట్ అవ్వడం.. డైరెక్టర్ మారడం వలన ఓజీతో పోలిస్తే బజ్ తగ్గిందనేది వాస్తవం. ఇదే విషయం గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణను అడిగితే.. నాలుగైదు సంవత్సరాల క్రితం వీరమల్లు మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిలిం కావడంతో ఇది స్టార్ట్ అయినప్పుడు దీని గురించే జనం ఎక్కువ మాట్లాడుకున్నారు. కానీ కరోనా, ఇతర కారణాల వల్ల మా సినిమా ఆలస్యమైంది. ఒక దశ దాటాక అప్‌డేట్లు కూడా రాలేదు. దీంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు రిలీజవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి తయారైంది. నాతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులూ ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. అదే టైమ్ లో ఓజీ గ్లింప్స్ రిలీజ్ అవ్వడం.. అదోక డిఫరెంట్ యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడిందని చెప్పారు.
మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు రెండు నెలల వ్యవధిలో రెండు సినిమాలు రాబోతున్నాయి. ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. ఈ రెండూ క్రేజీ సినిమాలే.. ఈ రెండూ సినిమాలూ బాగా ఆడతాయి అని జ్యోతికృష్ణ చెప్పాడు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో వీరమల్లు ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని జ్యోతికృష్ణ తెలియచేశారు. మరి.. జ్యోతికృష్ణ నమ్మకం ఎంత వరకు నిజమౌతుందో చూడాలి.