OG ప్రీమియర్ కలెక్షన్ తో పుష్ప 2 రికార్డు బద్దలు..!

OG Breaks Pushpa 2 Record: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘ఓజీ’ మేనియా జోరుగా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను పెద్ద పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందు రోజు రాత్రే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. టాక్ ఎలా ఉందనేది పక్కన పెడితే.. బాక్సాఫీస్ దగ్గర ఓజీ ఊచకోత కనిపిస్తోంది. ప్రీమియర్స్ తోనే ఎన్నో రికార్డులు బ్రేక్ అయినట్లు తెలుస్తోంది. ఓజి జస్ట్ ప్రీమియర్ షోతోనే సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పటిదాకా ఉన్న పుష్ప 2 రికార్డ్ ని బ్రేక్ చేసి పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది..

పవన్ కళ్యాణ్ లీడ్ రోల్‌లో నటించిన ఓజీ రిలీజ్‌కు ముందు నుంచే హైప్ క్రియేట్ చేసింది. టికెట్ ధరలు భారీగా పెరిగినప్పటికీ, ప్రేక్షకుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. నైజాం ప్రాంతంలోనే 366 ప్రీమియర్ షోలు వేయడం ఒక రికార్డే. రెండు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లలో మిడ్‌నైట్ షోల వరకు ప్రదర్శించడంతో, ఒక్క ప్రీమియర్ షోలతోనే ఇండియాలో రూ. 22.63 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో పవన్ కళ్యాణ్ ప్రీమియర్ల ద్వారా రూ. 12-15 కోట్లు వసూలు చేశారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రూ. 10.65 కోట్లు, శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ రూ. 8.5 కోట్లు రాబట్టగా, ఇప్పుడు OG సినిమా ఈ మొత్తం రికార్డులను అధిగమించి ఒక్క ప్రీమియర్ డేలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అయ్యింది. OG Breaks Pushpa 2 Record.

ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి టికెట్ ధరల పెంపు అని చెప్పొచ్చు . ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధర రూ.1000 దాకా వెళ్లింది. తెలంగాణాలో కూడా టికెట్లపై రూ.800 అదనంగా వసూలు చేశారు. ఇప్పటికే రికార్డు బ్రేక్ చేసిన OG, రెగ్యులర్ షోలతో ఇంకా ఏ మేరకు కలెక్షన్స్ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.