OG ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్!

OG first day collections: తెలుగు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ (OG) సినిమా ప్రేక్షకుల ముందుకు రాగానే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊహించినట్లుగానే, ఈ చిత్రం విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాజాగా, నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ఒక ప్రకటన చేస్తూ, సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ. 154 కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందని వెల్లడించింది.”ఇది పవన్ కళ్యాణ్ సినిమా… చరిత్రను ఓజీ తిరగరాసింది!” అని ఎమోషనల్ క్యాప్షన్ పెట్టారు.

‘ఓజీ’ ప్రీమియర్ షోల నుంచే కలెక్షన్ల పరంగా రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన క్షణం నుండి టికెట్లు సెకన్లలోనే సోల్డ్ అవుతుండటం, ఈ సినిమాపై ఎంతటి క్రేజ్ ఉందో నిరూపించింది. తొలి రోజు వసూళ్లు పవన్ కళ్యాణ్ సినీ జీవితం లోనే అత్యధికంగా నమోదైనవిగా నిలిచాయి. ఇది వరకు విడుదలైన టాప్ 10 ఇండియన్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్ల లిస్టులోకి ‘ఓజీ’ కూడా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ నుంచి ఆ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏడవ చిత్రం గానూ నిలిచింది.

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సుజీత్, పవన్‌కు డైహార్డ్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఆ ఫ్యాన్ ఫీలింగ్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ లుక్స్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజం అన్నింటినీ అత్యంత స్టైలిష్‌గా చూపిస్తూ, గతంలో పవన్ సినిమాల్లో మిస్సైన మాస్సివ్ వేరియేషన్స్‌ను తిరిగి తెచ్చారు. థమన్ సంగీతం, ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయింది. సినిమా టేకింగ్‌లో సుజీత్ చూపిన రేంజ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. OG first day collections.

OG యూనివర్స్ – ప్రభాస్ ఎంట్రీ?

ఇక ఈ సినిమాతో ఓజీ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమయ్యే అవకాశాలపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. దర్శకుడు సుజీత్ కూడా ఓ యూనివర్స్ రూపొందించాలనే ఆలోచన ఉందని తెలిపారు. అయితే, ఈ యూనివర్స్‌లో ప్రభాస్ కనిపిస్తారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేనని చెప్పారు. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ తన మాస్ క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. సుజీత్, తన అభిమాన హీరో కోసం రూపొందించిన ఈ సినిమాతో, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ యూనివర్స్ ఎలా విస్తరిస్తుందో చూడాలి.