బాక్సాఫీస్ దగ్గర OG జోరు.. 4 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?

OG 4th day collection: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ఓజీ మూవీ గురువారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ తో రన్‌ అవుతుంది. గ్యాంగ్‌ స్టర్‌ యాక్షన్‌ క్రైమ్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఇందులో మొదటి సారి పవన్‌ కళ్యాణ్‌ రోల్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటం, ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా యాక్షన్‌ ఎపిసోడ్లు ఉండటంతో వారంతా పండగా చేసుకుంటున్నారు. థియేటర్లలో అరుపులు, ఈలలతో హోరెత్తిస్తున్నారు. ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే జోరు చూపించింది. పవన్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా 154 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా నాలుగో రోజుకీ అదే జోరు చూపించింది. తాజాగా మూవీ టీమ్ ఓజీ 4 డేస్ కలెక్షన్ వివరాల్ని అధికారికంగా ప్రకటించింది..

పవన్ కళ్యాణ్ OG సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పటిదాకా రూ.100 కోట్ల షేర్ లేని స్టార్ హీరో అనే ట్యాగ్ ను చెరిపేసుకున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్స్ సాధించి మైల్ స్టోన్ మార్క్ అందుకుంది. ఇక తాజాగా నాలుగు రోజుల కలెక్షన్ వివరాల్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. OG 4th day collection.

ఓజి మూవీకి నాలుగు రోజుల్లో ఏకంగా 252 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. పవన్ కళ్యాణ్ సినిమాకి 100 కోట్ల కలెక్షన్స్ రావడం ఓ రికార్డ్ అయితే ఇప్పుడు ఏకంగా 300 కోట్ల మార్క్ కి ఓజి దగ్గరవడం అంటే మాములు విషయం కాదు. దీన్ని బట్టి బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం నాలుగు రోజుల్లోనే 252 కోట్లు కలెక్ట్ చేసిన ఓజి వీకెండ్ పూర్తయ్యే లోపే 300 కోట్ల మార్క్ ను టచ్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.