
OG Movie Censor talk: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’పై అంచనాలు ఇప్పుడు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, టీజర్లు, సాంగ్స్ అన్నీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. పవన్ స్టైల్, ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్ చూసిన వారందరికీ ఇది పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవబోతుందనే నమ్మకం కలిగింది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. పవన్ మాస్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా, నిర్మాణ బాధ్యతలు డీవీవీ దానయ్య తీసుకున్నారు. ‘
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూసినవారంతా ఇది పవన్ కెరీర్లో వేరే లెవెల్ మూవీ అనడంలో సందేహమే లేదనిపించేలా ఉంది. థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన లవ్ సాంగ్ సాఫ్ట్‌గా ఉండటంతో, ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించే అవకాశముంది.
సినిమాలో బ్లడ్, ఇంటెన్స్ యాక్షన్ ఎక్కువగానే ఉన్నా, క్లీన్ U/A సర్టిఫికెట్ రావడం కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. అయినప్పటికీ, సినిమాపై చిత్రబృందానికి పూర్తి నమ్మకం ఉంది. పవన్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వర్క్ అవుతాయనీ మూవీ టీమ్ ధీమాగా ఉంది. ఇంకా విలన్ రోల్లో ఇమ్రాన్ హష్మీ ప్రెజెన్స్ సినిమాకు ప్లస్ అవుతుందని, పవన్-ఇమ్రాన్ మధ్య వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమా హైలైట్‌గా నిలవనున్నాయని టాక్. OG Movie Censor talk.
హీరోయిన్ ప్రియాంక మోహన్ గ్లామర్‌తో పాటు, పాత్రకీ న్యాయం చేసిందని తెలుస్తోంది.అంతేకాదు, సినిమాకి ఫస్టాఫ్-సెకండాఫ్ లాంటి తేడాలు లేకుండా నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని, థ్రిల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా డిజైన్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.