OG గన్స్ అండ్ రోజెస్ సాంగ్ అదిరిపోయిందిగా!

Guns N’ Roses పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీ ఇప్పటికే హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పటికే ఓజీ నుంచి రిలీజైన కంటెంట్‌తో పిచ్చెక్కిపోయిన ఫ్యాన్స్‌కు మరింత క్రేజ్‌ను ఇచ్చేలా చిత్రయూనిట్ లేటెస్ట్‌గా ఇంకో సాంగ్‌ను అందించింది. గన్స్ అండ్ రోజెస్ పేరుతో రిలీజైన తాజా సాంగ్ ఫ్యాన్స్‌ను సరికొత్త మైకంలో ముంచెత్తుతుందనడంలో ఎలా అతిశయోక్తి లేదు. ఓజీ నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ నాలుగో సాంగ్ కూడా రిలీజ్ అయినప్పటి నుంచే భారీ వ్యూవ్స్ దిశగా దూసుకెళ్తోంది.

పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ క్రేజ్‌కు, సుజీత్ టేకింగ్‌కు తమన్ మ్యూజిక్ తోడైతే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ‘ఓజీ’ సాంగ్స్ కళ్లకుకట్టినట్లు చూపిస్తున్నాయి. గన్స్ అండ్ రోజెస్ సాంగ్‌‌కు అద్వితీయ సాహిత్యం అందించగా శృతిరంజనీ, అద్వితీయ, ప్రణతి, శృతిక, ప్రత్యూష, గిరిజ, సౌజన్య, హర్ష కలిసి ఆలపించారు. మూవీ థీమ్‌ ఏంటనేది తెలియజేసేలా లిరిక్స్ ఉన్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పాటను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి విలన్‌‌గా నటించగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్, జీవా, శుభలేక సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెంకట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Guns N’ Roses

సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది. అభిమానులు ఇప్పటికే సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. ‘ఓజీ’ ట్రైలర్ మరో భారీ సంచలనాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఎక్కడా చూసినా ‘ఓజీ’ పేరు మారుమోగిపోతోంది. 2025లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటని అందరూ దీనిని అభివర్ణిస్తున్నారు. ‘ఓజీ’ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ‘గన్స్ ఎన్ రోజెస్’ గీతం కూడా అదే బాటలో పయనిస్తూ సంచలనం సృష్టిస్తోంది.