
Nani & Srikanth Odela’s Paradise: నేచురల్ స్టార్ నాని విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3.. ఇలా తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తున్నాడు. ఇప్పుడు షాకింగ్ స్టోరీతో ప్యారడైజ్ అంటూ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. అయితే.. ఈ మూవీ గురించి ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే… ఇందులో ఇద్దరు బాబులు నటిస్తున్నారట. ఇంతకీ.. ఆ ఇద్దరు బాబులు ఎవరు..? వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..?
ప్యారడైజ్ మూవీ గ్లింప్స్ తోనే అందరికీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా నాని గెటప్ ఊహించని విధంగా ఉంది. దీంతో ఈ సినిమాలో చాలా షాకింగ్ లు ఉంటాయనే ఫీలింగ్ కలిగించింది. నేచులర్ స్టార్ ని దసరా సినిమాలో ఊర మాస్ గా చూపించి.. మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. అందుకనే ఆ సినిమా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు నాని, శ్రీకాంత్ ఓదెల మళ్లీ కలిసి సినిమా చేస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి త్వరలో కీలక అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఇద్దరు బాబులు కీలక పాత్ర పోషించబోతున్నారట. ఆ బాబు ఎవరంటే.. ఒకరు విలక్షణ నటుడు మోహన్ బాబు కాగా రెండో బాబు…హాస్యనటుడు బాబు మోహన్. ఈ ఇద్దరి కాంబో చాలా గ్యాప్ తర్వాత తెర పై కనిపించబోతుంది. ఇది ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. గతంలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉన్న బాబు మోహన్ మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలి అనుకుంటున్నారు. ఇటీవల ఆయన ఉప్పు కప్పురంబు అనే సినిమాలో నటించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో బాబు మోహన్.. ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నట్టుగా తెలియచేశారు. Nani & Srikanth Odela’s Paradise.
అంతే కాకుండా ఆయన పాత్ర అందర్ని సర్ ఫ్రైజ్ చేస్తుందని చెప్పారు. బాబు మోహన్ అలా చెప్పడంతో పాత్ర ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఇందులో కిల్ మూవీ ఫేమ్ రాఘవ జుయాల్ ను విలన్ గా ఫైనల్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. అదే నెలలో ఒక రోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్ది రిలీజ్ అని ప్రకటించారు. దీంతో నాని ప్యారడైజ్ మూవీని పోస్ట్ పోన్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది కానీ.. తగ్గేదేలే అన్నట్టుగా మార్చి 26నే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్.