ప్రభాస్ తో అలాంటి డైలాగ్స్ చెప్పిస్తాడా..?

Prabhas and Sandeep Reddy combo: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్నట్టుగా ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంత వరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలోని డైలాగులు గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇంతకీ స్పిరిట్ లో డైలాగులు ఎలా ఉండబోతున్నాయి..? ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు..?

సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో చూశాం. ఆతర్వాత కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో కూడా సక్సెస్ సాధించి సంచలనం సృష్టించాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్ తో చేయనున్న స్పిరిట్ మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. సందీప్ రెడ్డి సినిమా అంటే.. డైలాగుల్లో బూతులు ఉంటాయి. కొన్ని సీన్స్ చూడడానికి ఇబ్బందిగా ఉంటాయనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. అయితే.. ప్రభాస్ ఏమో క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో. ఇలాంటి హీరోతో అలాంటి డైరెక్టర్ సినిమా చేస్తే.. ప్రభాస్ స్టైల్ లో ఉంటుందా..? లేక సందీప్ స్టైల్ లో ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది.

సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ కోసం స్టైల్ మార్చుకుంటాడా..? లేక ప్రభాస్ కోసం సందీప్ స్టైల్ మార్చుకుంటాడా..? అనే చర్చ జరుగుతుంది. మరో విషయం ఏంటంటే.. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. అందుచేత పోలీస్ తో బూతు డైలాగులు చెప్పిస్తే బాగోదు. ఈ కారణంగా సందీప్ తన స్టైల్ లో కాకుండా ప్రభాస్ స్టైల్ లో ఎలాంటి బూతులు లేకుండా సినిమా తీస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు వేరే సినిమా చేయకూడదు అనే కండీషన్ పెట్టాడట సందీప్ రెడ్డి వంగ. దీనికి ప్రభాస్ ఓకే చెప్పాడని తెలిసింది. Prabhas and Sandeep Reddy combo.

అందుకనే ఈ సినిమా ఇంకా పట్టాలెక్క లేదు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంతకీ ఎప్పుడు స్పిరిట్ స్టార్ట్ కానుంది అంటే.. సెప్టెంబర్ నెలాఖరున స్టార్ట్ కానుందని తెలిసింది. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే.. ఇక బ్రేక్ అనేది లేకుండా షూటింగ్ చేయడానికి సందీప్ పక్కా ప్లాన్ రెడీ చేశాడట. అలాగే చాలా అంటే చాలా స్పీడుగా షూటింగ్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్. మరి.. ప్రబాస్, సందీప్ కలిసి స్పిరిట్ తో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/war-2-movie-director-ayan-mukerji-war-2-movie-release-on-august-14/