OG- 2 లో ప్రభాస్.. అసలు నిజం ఇదే?

Prabhas in OG 2: టాలీవుడ్ నుంచి ఇటీవల విడుదలై, భారీ హిట్‌గా నిలిచిన మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజీ” సినిమాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, రిలీజ్ రోజే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్ సృష్టించింది. దాంతో, మేకర్స్ ప్రత్యేకంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఇక తాజాగా ఈ సినిమా పై మరింత హైప్ తెచ్చిన విషయం ఏమిటంటే, సుజీత్ తన ‘సాహో’ సినిమాతో ‘ఓజీ’ కు లింక్ ఏర్పాటు చేసినట్లు కొన్ని విశ్లేషకులు మరియు ఫ్యాన్స్ మదిలో ఏర్పడిన ఊహాగానాలు. ఇలా చూస్తే సుజీత్ తన సినిమాటిక్ యూనివర్స్ ను ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో డైరెక్టర్లు సినిమాటిక్ యూనివర్స్‌లపై దృష్టి పెడుతున్నారు. ప్రశాంత్ వర్మ, హిట్ సిరీస్, మరియు మరెన్నో ఫ్రాంచైజీలు ఈ విధానంలో ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు సుజీత్ కూడా అదే దారిలో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఓజీ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఓ సీన్ ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన గంభీర్ పాత్ర, ఓ మాఫియా లీడర్ వాజీ అనే నగరంపై ఒమీ చేసిన దాడి గురించి చెబుతాడు. ఆ నగరాన్ని లీడ్ చేసిన లీడర్ పెద్ద కుమారుడిని ఓమీ చంపేశాడని, రెండవ కుమారుడిని మాత్రం మాఫియాలోంచి దూరంగా పెంచారని చెబుతాడు. ఆ రెండవ కుమారుడు ఎవరో కాదు – మన సాహో అంటే ప్రభాస్ అని అనిపించేలా డైరెక్టర్ ట్రాక్ సెట్ చేశారు. ఈ చిన్న సీన్‌తోనే రెండు సినిమాల మధ్య సంబంధం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఫ్యూచర్‌లో ఓజీ-2 వస్తే, ప్రభాస్ పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, అది నిజమైతే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. Prabhas in OG 2.

తాజగా జరిగిన ఒక మీడియా సమావేశంలో దర్శకుడు సుజీత్ దీనిపై స్పందిస్తూ –”ప్రభాస్, పవన్ గారితో నాకు మంచి బాంధవ్యముంది. ఒక సినిమాటిక్ యూనివర్స్ మీద నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి. కానీ ఇప్పటికి వాటిపై పూర్తిగా ఫోకస్ చేయలేకపోయాను. ప్రస్తుతం పవన్ గారు పాలిటికల్ గా బిజీగా ఉన్నారు, అందువల్ల ఇది ఎటువైపు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చారు. ఓజీ-2లో ప్రభాస్ పాత్ర ఉంటే, సినిమా స్థాయి ఏ రేంజ్ కి వెళ్లిపోతుందో ఊహించలేం. అభిమానుల దృష్టిలో ఇది కేవలం కలయిక కాదు, పండుగ. గంభీర్, సాహో పాత్రలకు ఫ్రెండ్‌షిప్ బేక్‌స్టోరీ, లేదా గురువు-శిష్య సంబంధం చూపించినా, ప్రేక్షకులకు ఊహించలేని థ్రిల్ ఇవ్వొచ్చు. ఓజి 2 కి సంబంధించి సుజీత్ ప్లాన్ ఏమైనా ఉన్నా, దానిని అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ డేట్స్, ప్రభాస్ అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ.