
Talikattu Subhavela శ్రీ వెంకటా చలపతి ఫిలింస్ పతాకంపై బి. అరుణ్ కౌశిక్ నిర్మాణంలో, వి. జగన్నాధరావ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “తాళికట్టు శుభవేళ”. తిలక్ రాజ్, తుంగ హీరోహీరోయిన్స్, దేవరాజ్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, నటుడు-యాక్టింగ్ ట్రైనర్ వినోద్ కుమార్ నువ్వుల, నటుడు-నిర్మాత-దర్శకుడు తల్లాడ సాయికృష్ణ, నటి-ప్రముఖ వ్యాఖ్యాత స్వప్న చౌదరి అమ్మినేని, సంగీత దర్శకుడు వి.ఆర్.ఎ. ప్రదీప్, గాయని ఏజే సంధ్యావర్షిణి, సినీ దర్శకుడు ప్రణయ్ రాజ్ వంగరి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, వీడియో సాంగ్స్, ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ – “తాళికట్టు శుభవేళ సినిమా పేరు విన్నప్పుడే ఎంతో పాజిటివ్‌గా అనిపించింది. ఈ సినిమా సంగీతం చాలా మధురంగా ఉంది. కొత్త తరానికి విలువలు నేర్పే మంచి కుటుంబ కథతో ఈ చిత్రం నిలిచిపోతుందని నమ్ముతున్నాను. నిర్మాత అరుణ్ కౌశిక్, రచయిత-నిర్మాత చలపతిగారు, మొత్తం యూనిట్‌కు నా శుభాకాంక్షలు” అన్నారు.
నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త మాట్లాడుతూ – “ఈ చిత్రంలోని పాటలు విన్నప్పుడు నిజంగా కుటుంబ వాతావరణాన్ని గుర్తు చేశాయి. కొత్త తరహా భావోద్వేగ కథను తెరపైకి తీసుకురావడం యూనిట్ ధైర్యం. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు-యాక్టింగ్ ట్రైనర్ వినోద్ కుమార్ నువ్వుల మాట్లాడుతూ – “నటీనటులు చాలా సహజంగా నటించారు. ట్రైలర్, పాటలు చూశాక ఈ సినిమాలో మంచి ఆత్మ ఉంది అనిపించింది. కుటుంబ చిత్రాల అభిమానులకు ఇది నచ్చే సినిమా అవుతుంది” అన్నారు.
నటుడు-నిర్మాత-దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ – “తాళికట్టు శుభవేళలో ఉన్న భావోద్వేగం, కథా తత్త్వం చాలా బలంగా ఉన్నాయి. ఈ తరహా కథలు రావడం చాలా అవసరం. నిర్మాత, దర్శకుడు కృషి కనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం మంచి పేరు తెచ్చుకుంటుంది” అన్నారు.
నటి- వ్యాఖ్యాత స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ – “సినిమా పేరు చాలా అద్భుతంగా ఉంది. పాటలు వినగానే మనసుకు హత్తుకున్నాయి. మహిళలకు, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరగా అనిపించే కథ ఇది. మొత్తం యూనిట్‌కు నా శుభాకాంక్షలు” అన్నారు.
సంగీత దర్శకుడు వి.ఆర్.ఎ. ప్రదీప్ మాట్లాడుతూ – “తాళికట్టు శుభవేళ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచే ఈ చిత్రంపై మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. కుటుంబ కథాంశంతో, భావోద్వేగాలతో, వినోదంతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. ఇలాంటి శుభ్రమైన సినిమాలు ఎక్కువగా రావాలి. నిర్మాతలు, దర్శకుడు ఎంతో శ్రద్ధతో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. సినిమా మరో గోరింటాకు సినిమాగా విజయవంతం కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
గాయని ఏజే సంధ్యావర్షిణి మాట్లాడుతూ – “తాళికట్టు శుభవేళ అనే పేరు వినగానే ఒక పండుగ వాతావరణం గుర్తుకు వస్తుంది. ట్రైలర్, పోస్టర్, పాటలు అన్నీ చూసినప్పుడు ఈ సినిమా కుటుంబానికి దగ్గరగా ఉండేలా తెరకెక్కిందని అర్థమవుతుంది. ఈ తరహా చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. దర్శకుడు, నిర్మాతలకు, మొత్తం యూనిట్‌కి నా అభినందనలు. సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సినీ దర్శకుడు ప్రణయ్ రాజ్ వంగరి మాట్లాడుతూ – “తాళికట్టు శుభవేళ ఒక మంచి కుటుంబ కథతో వస్తోంది. దర్శకుడు జగన్నాధరావుగారు, రచయిత చలపతిగారు ఎంతో శ్రద్ధతో ఈ కథను నిర్మించారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
ఈ సందర్భంగా సినిమా రచయిత, నిర్మాత బి. చలపతి మాట్లాడుతూ – “మా యూనిట్ ఎంతో శ్రద్ధతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. కుటుంబానికి దగ్గరగా ఉండే కథ, భావోద్వేగభరితమైన సన్నివేశాలు, మధురమైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సప్తగిరి ప్రొడక్షన్స్ నిర్మాత శంకర్ రామిరెడ్డి, డిస్ట్రిబ్యూటర్ గణేష్ భారి మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ శైలిని ప్రతిబింబించే వినూత్న కథా వస్తువుతో వినోదం, భావోద్వేగాన్ని సమపాళ్లలో కలగలిపిన ఈ “తాళికట్టు శుభవేళ” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Talikattu Subhavela