
Pawan Kalyan’s Ustad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. ఓజీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక మిగిలింది.. ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ కంప్లీట్ చేయాలని ఎప్పటి నుంచో హరీష్ శంకర్ తపిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూట్ లో కూడా పవర్ స్టార్ జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీ కోసం మరో హీరోయిన్ ని రంగంలోకి దింపారని తెలిసింది. ఇంతకీ.. ఆ హీరోయిన్ ఎవరు..? ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్.. ఈ ఇద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ రూపొందడం.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించాడు హరీష్ శంకర్. అందుకనే.. గబ్బర్ సింగ్ అంత పెద్ద హిట్ అయ్యింది. ఆతర్వాత మళ్లీ ఈ కాంబోలో సినిమా వస్తే చూడాలని ఎప్పటి నుంచో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా పూర్తవుతుందా..? ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
వీరమల్లు, ఓజీ కంప్లీట్ చేయడంతో పవర్ స్టార్ ఇప్పుడు ఉస్తాద్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే.. ఈ సినిమాలో పవన్ కు జంటగా కిసిక్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ లో దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని మార్పులు చేర్పులు చేశారట. ఆయా మార్పుల ప్రకారం సినిమాలో ఇంకో హీరోయిన్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ భావించి, సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా డిజైన్ చేశారు. దీంతో ఇందులో సెకండ్ హీరోయిన్ గా రాశీఖన్నాను ఎంపిక చేశారు. ఈ రోల్ కోసం చాలా మంది హీరోయిన్లను పరిశీలించి, ఆఖరికి రాశీఖన్నాను ఫైనలైజ్ చేశారు. Pawan Kalyan’s Ustad Bhagat Singh.
ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో రాశీఖన్నా జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. దీంతో రాశీ పాత్ర ఎలా ఉంటుంది..? ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. ఈ అమ్ముడు ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం అవుతున్నా.. ఇంత వరకు సరైన సినిమా పడలేదు. రవితేజ, ఎన్టీఆర్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్ తదితర యంగ్ హీరోలతో నటించింది కానీ.. సరైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు పవర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఉస్తాద్ రాశీఖన్నా దశ మార్చేస్తుందని చాలా నమ్మకం పెట్టుకుంది. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. మరి.. ఉస్తాద్ రాశీ ఖన్నాకు బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.