
Rajinikanth’s latest movie Coolie: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, శాండిల్ వుడ్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ మూవీకి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ తో మరింతగా అంచనాలు పెరిగాయి. ఆగష్టు 14న కూలీ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే.. ఇప్పుడు కూలీ కథ ఇదే అంటూ ఓ స్టోరీ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఏంటా కథ..? తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ స్టోరీ చూడాల్సిందే.
కూలీ కథ ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది నిజమా..? కాదా..? అనే చర్చ మొదలైంది. ఇంతకీ కథ ఏంటంటే.. రజినీకాంత్ ఇందులో దేవ అనే క్యారెక్టర్ లో కనిపిస్తాడట. దేవ గోల్డ్ స్మగ్లింగ్ చేసే మాఫియా గ్యాంగ్ లీడర్. అయితే.. ఈ గ్యాంగ్ లీడర్ అన్నీ వదిలేసి ఫ్యామిలీ కోసం సాధారణ జీవితం గడుపుతుంటాడు. అతని తమ్ముడైన షాబిన్ షాహిర్ ని నాగార్జున చంపేస్తాడట. దీంతో అతని పై ప్రతికారం తీర్చుకునేందుకు తన మాఫియా గ్యాంగ్ ని తిరిగి నిర్మించడం స్టార్ట్ చేస్తాడట. అయితే.. షాబిన్ షాహిర్ ని నాగార్జున ఎందుకు చంపేసాడు..? అతనని చంపాలనే దేవ ప్రయత్నం ఫలించిందా..? లేదా..? అనేదే ఈ కూలీ కథ అని టాక్.
ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనిర్శ్ కు సంబంధం లేదని.. ఇది వేరే కథ అని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన నాగార్జున గురించి శృతి హాసన్ స్పందించింది. ఆయన క్యారెక్టర్ వేరే లెవల్లో ఉంటుందని.. ఇప్పటి వరకు నాగార్జున గారు చేయని విలన్ క్యారెక్టర్ ను అద్భుతంగా చేశారని చెప్పింది. అంతే కాకుండా.. ఈ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు ఒక ట్రీట్ లా ఉంటుందని చెప్పింది. శృతి హాసన్ నాగ్ క్యారెక్టర్ గురించి ఇలా స్పందించడంతో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా అనుకున్న టైమ్ కు అనుకున్న విధంగా పూర్తైంది.
దీంతో ప్రమోషన్స్ కు కావాల్సినంత టైమ్ దొరికింది. లోకేష్ కనకరాజ్ ఓ వైపు తమిళ్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. అలాగే శృతి హాసన్ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తుంది. దీనికి యువ సంగీత సంచలనం అనిరుథ్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు పాటలు యూట్యూబ్ ని షేక్ చేశాయి. త్వరలో ప్రమోషన్స్ లో మరింత స్పీడు పెంచనున్నారు. ఆగష్టు 2న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయితే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. Rajinikanth’s latest movie Coolie.