
Vetrimaaran Simbu combo Movie: కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్, శింబు కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. మేకర్స్ అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రకటించడంతో పాటు టైటిల్‌ను కూడా విడుదల చేశారు. వెట్రిమారన్-శింబు కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘ఆరసన్’ అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది శింబు కెరీర్‌లో 49వ చిత్రంగా రూపొందనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత కళైపులి థాను నిర్మిస్తున్నారు, ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో శింబు సరసన హీరోయిన్‌గా నటించేందుకు సౌత్ స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ సమంత ఈ సినిమాలో నటించడానికి అంగీకరిస్తే, శింబు-సమంత కలిసి నటించబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సమంతతో పాటు కీర్తి సురేశ్, శ్రీలీల పేర్లను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన సమంత, ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆమె గతంలోలా ఎక్కువ సినిమాలు చేయకుండా ఆచితూచి ప్రాజెక్టులను ఎంచుకుంటోంది. చాలా కాలం తరువాత ఆమె తమిళంలో సినిమా చేయనుందన్న వార్త సమంత అభిమానులను సంతోష పరుస్తోంది. Vetrimaaran Simbu combo Movie.
ఈ ‘ఆరసన్’ చిత్రం దర్శకుడు వెట్రిమారన్ ‘వడ చెన్నై యూనివర్స్’ లో భాగంగా రూపొందనుందని ఇప్పటికే వెల్లడైంది. 2018లో ధనుష్ హీరోగా వచ్చిన ‘వడ చెన్నై’ సినిమా తరువాత ఈ యూనివర్స్‌లో రానున్న మరో చిత్రమిది. ఈ యూనివర్స్‌లో భవిష్యత్తులో మరిన్ని సినిమాలు రానున్నాయి.దర్శకుడిగా వెట్రిమారన్, నటుడిగా శింబు ఇద్దరూ ప్రత్యేక ప్రతిభావంతులు కావడంతో వీరిద్దరి కలయికపై తమిళనాట అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ కాంబో గురించి నిత్యం చర్చ జరుగుతోందంటే సినిమాపై ఉన్న హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.