
Sandeep Reddy’s movie with megastar: అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆతర్వాత కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. నెక్ట్స్ ఏంటి అంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయాలి. ఎప్పటి నుంచో ఈ సినిమా వార్తల్లో ఉంది. ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. సందీప్ రెడ్డి మెగాస్టార్, సూపర్ స్టార్ లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. స్పిరిట్ తర్వాత సందీప్ ప్లాన్ ఏంటి..?
ప్రభాస్ ను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సందీప్ రెడ్డి వంగ చూపించబోతున్నాడు. ఇందులో ప్రభాస్ డబుల్ రోల్ లో కనిపిస్తాడని.. ఈ రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఈ కథను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని సెప్టెంబర్ నెలాఖరున స్టార్ట్ చేయనున్నాడని తెలిసింది. అయితే.. సందీప్ రెడ్డి వంగతో అల్లు అర్జున్ సినిమా అని ఎప్పుడో ప్రకటించారు. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఓ వైపు అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. మరో వైపు సందీప్ రెడ్డి బిజీగా ఉన్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
మరి.. స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి సినిమా ఎవరితో అంటే.. ఆమధ్య మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించింది. అయితే.. మెగాస్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలు ఓకే చేశారు. విశ్వంభర రిలీకి రెడీ అవుతోంది. ఆతర్వాత అనిల్ రావిపూడితో సినిమా సంక్రాంతికి వస్తుంది. బాబీతో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా ఫిక్స్ చేశారు. ఇలా చిరు చాలా బిజీగా ఉన్నారు. చిరు, సందీప్ రెడ్డి వంగ.. ఈ క్రేజీ కాంబోలో మూవీ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ రావాల్సవుంది. చిరంజీవికి డైహార్డ్ ఫ్యాన్ కావడంతో చిరును ఎలా చూపిస్తాడా అనే క్యూరియాసిటీ ఉంది. Sandeep Reddy’s movie with megastar.
ఇక సందీప్ లిస్ట్ లో ఉన్న మరో స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా ఎప్పుడో ఉండాలి. ఘుగర్ ఫ్యాక్టరీ అనే కథను మహేష్ కోసం రెడీ చేశాడు. కాకపోతే ఇందులో వయోలెన్స్ ఎక్కువ ఉండడంతో ఆ కథకు మహేష్ నో చెప్పాడు. ఆ కారణంగా ఈ కాంబో మూవీ లేట్ అయ్యింది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ వరల్డ్ మూవీ. ఈ సినిమా తర్వాత మహేష్ చేయాలి అనుకుంటున్న దర్శకుల్లో సందీప్ ఉన్నాడు. ఈ క్రేజీ మూవీ పై క్లారిటీ రావాలన్నా వెయిటింగ్ తప్పదు. మరి.. మెగాస్టార్, సూపర్ స్టార్.. ఈ ఇద్దరి హీరోలతో సందీప్ సినిమా చేస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.