
Sayesha Shah: పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ సినిమా థియేటర్లలో విజయవంతంగా పరుగులు తీస్తోంది. సినిమా విడుదలైన తర్వాత నుంచి పవన్ లుక్స్, కథలోని మాస్ యాంగిల్‌కి ఫ్యాన్స్ ఫుల్‌గా కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలోనే కాకుండా, ఒక తండ్రిగా కూడా కనిపించడం సినిమాకు మరో ఎమోషనల్ లెవెల్‌ను తీసుకువెళ్లింది. ముఖ్యంగా సెకెండాఫ్ మొత్తం తండ్రి – కూతురు మధ్య అనుబంధాన్ని సెంటిమెంటుగా చూపించి ఆడియన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేశారు. ఈ నేపథ్యంలో OG సినిమాలో పవన్ కుమార్తెగా నటించిన చిన్నారి ఎవరు అనే ఆసక్తి సోషల్ మీడియాలో నెటిజన్లలో విపరీతంగా పెరిగింది. దీంతో ఆ పాప వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఆ పాప పేరు సాయేషా షా. ముంబయికి చెందిన ఈ ఈ చిన్నారి చిన్న వయస్సులోనే ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకుంది. డెంటల్, యూరో కిడ్స్, సంతూర్, టాజెల్, లెన్స్‌కార్ట్, ఇంకా పలు రియల్ ఎస్టేట్ ప్రకటనల్లో సాయేషా కనిపించింది. ఆమె ఇప్పటికే బాలీవుడ్ స్టార్‌లతో కూడా కొన్ని యాడ్స్‌లో నటించింది. మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఓ రియల్ ఎస్టేట్ యాడ్‌లో నటించిన అనుభవం కూడా ఉంది.
అంతేకాకుండా, ‘లాగౌట్’ అనే హిందీ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించినప్పటికీ, అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘OG’ సినిమాతో సాయేషా ఫస్ట్ టైమ్ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం. అయినా కూడా ఆమె నటనలో ఏమాత్రం తడబాటు కనిపించకపోవడం విశేషం. పవన్ కళ్యాణ్‌కి కూతురిగా సాయేషా తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Sayesha Shah.
సాయేషాను OG చిత్రానికి ఎంపిక చేసినట్లు సమాచారం ఓ కాస్టింగ్ ఏజెన్సీ ద్వారా సెలెక్ట్ చేశారట.OGలో ఆమె నటన చూసిన ప్రేక్షకులు, విమర్శకులు సైతం ఈ చిన్నారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు తప్పవని అంటున్నారు. సెప్టెంబర్ 25న OG చిత్రం విడుదలైన తర్వాత, సినిమా యూనిట్‌తో దిగిన ఫోటోలను సాయేషా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో గడిపిన సమయాన్ని తలచుకుంటూ “ఆటలు ఆడుకోవడం మిస్ అవుతా” అని చెప్పింది. నటుడు అర్జున్ దాస్ ఇచ్చిన చాక్లెట్లకు థాంక్స్ చెబుతూ, ప్రకాశ్ రాజ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. అంతేకాదు, ఈ చాన్స్ ఇచ్చిన దర్శకుడు సుజిత్‌కు, పవన్ కళ్యాణ్‌తో పాటు OG టీంకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.