
Sharwanand divorce: సినీ ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, విడాకులు, మళ్లీ కొత్త సంబంధాలు అన్నివే సర్వసాధారణం. తెరపై కెమిస్ట్రీ చూపించే హీరో, హీరోయిన్లు నిజ జీవితంలోనూ ప్రేమలో పడటం, తర్వాత మళ్లీ ఇతరుల్ని పెళ్లి చేసుకోవడం చిత్రసీమలో విస్తృతంగా కనిపించే దృశ్యాలే. బాలీవుడ్‌తో పోలిస్తే, సౌత్ ఇండస్ట్రీలో వీటి గురించి బయటకు వచ్చేవి తక్కువే. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ క్రేజీ హీరో వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో శర్వానంద్ గురించి ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఆయన తన భార్య రక్షితతో విభేదాల కారణంగా వేర్వేరు గా జీవిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట 2023లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో వైభవంగా పెళ్లి చేసుకుంది. రక్షిత ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా, వారికి ఇప్పటికే ఒక చిన్న పాప కూడా ఉంది. వీరి కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉందని భావించిన అభిమానులకు ఈ రూమర్స్ షాకింగ్‌గా మారాయి.
వారు చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా, ప్రస్తుతం ఒకే ఇంట్లో నివసించడం లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పాప మాత్రం తల్లి దగ్గర కొన్నిరోజులు, తండ్రి దగ్గర మరికొన్ని రోజులు ఉంటుందట. వీరి వ్యక్తిగత జీవితం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా, ఈ దంపతుల గురించి సోషల్‌మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. బహుషా శర్వా స్పందించి ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ డివోర్స్ మ్యాటర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గా శర్వానంద్ ‘మనమే’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ మూవీ తర్వాత శర్వానంద్.. ‘లూజర్'(వెబ్ సిరీస్) దర్శకుడు అభిలాష్ రెడ్డితో ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా హోల్డ్ లో పడింది. అలాగే రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారి నారి నడుమ మురారి’ కూడా కంప్లీట్ చేయాలి. వీటితో పాటు సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ అనే సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు. వీటితో పాటు మరిన్ని కథలు విని కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ను హోల్డ్ లో పెట్టాడు. Sharwanand divorce.
ఇక పెండింగ్లో ఉన్న తన 3 ప్రాజెక్టులను 2026 సమ్మర్ నాటికి కంప్లీట్ చేస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చాడట శర్వా. వీటిలో నారి నారి నడుమ మురారి’ మొదట రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో శర్వా సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలోనే దిగుతుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.