పెళ్లి తర్వాత శోభిత ఫస్ట్ సినిమా.. హీరో ఎవరంటే..?

Shobita Dhulipala: గతేడాది అక్కినేని నాగచైతన్యతో వివాహ బంధంతో ఒక్కటైన ఆమె, ఆ తర్వాత సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చింది. పెళ్లి అనంతరం ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పినట్టు కనిపించిన శోభిత, తాజాగా సినిమాల్లోకి తిరిగి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆమెకు పెళ్లి తరువాతి తొలి సినిమా కావడం విశేషం.

శోభిత తాజాగా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వెట్టువం’ అనే సినిమాలో శోభిత లీడ్ రోల్‌లో నటించనున్నారు. ఈ వార్తను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ లో చిన్న పాత్రలో కనిపించిన శోభితకు ఇది తమిళంలో నాయికగా చేస్తున్న మొదటి చిత్రం.

పా. రంజిత్ సినిమాలు సామాజికంగా చర్చకు దారి తీసే విధంగా ఉంటాయి. కుల వ్యతిరేకత, అణగారిన వర్గాల సమస్యలు, సామాజిక విప్లవం వంటి అంశాలను కసిగా చూపించడంలో ఆయనకు ప్రత్యేకత ఉంది. ఇటీవల విడుదలైన ‘తంగలాన్’ చిత్రంలో స్టార్ హీరో విక్రమ్‌ను విభిన్న పాత్రలో చూపించి ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి దర్శకుడి చేతిలో శోభితకు పాత్ర దక్కడం అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. Shobita Dhulipala.

ఈ సినిమాలో దినేశ్ హీరోగా నటించగా, ఆర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. శోభిత పాత్ర సినిమాకే కీలకంగా ఉండబోతోందని సమాచారం. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్ర శక్తివంతంగా, డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. ఇది భవిష్యత్‌ను ఆధారంగా చేసుకున్న ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కావడంతో, పాత్రలందరికీ డెఫ్త్ ఉండేలా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభిత, దినేశ్, ఆర్యలతో పాటు అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్, కలైయరసన్, గురు సోమసుందరం, మైమ్ గోపి, షబీర్ కల్లరక్కల్, హరీష్ ఉత్తమన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.