“తెలుసు కదా” లో నా రియల్ లైఫ్ క్యారక్టర్ ని చూస్తారు..

Shrinidhi Shetty Interview: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా కలిసి ఈ దీపావళికి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా వున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.ఇప్పటి వరకు రిలీజ్ అయినా పాటలు, టీజర్ యూత్ ను ఆకట్టున్నాయి.అక్టోబర్ 17 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.కేజీఎఫ్, హిట్ 3 తరువాత ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్న ఈ భామ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

శ్రీనిధి మాట్లాడుతూ..” కేజిఎఫ్, హిట్ త్రీ యాక్షన్, చాలా బ్లడ్ బాత్ ఉన్న సినిమాలు. తెలుసు కదా ఒక లైట్ హార్టెడ్ మూవీ చాలా కొత్తగా ట్రై చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి వున్నప్పుడు ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అనుకుంటారు. కానీ తెలుసు కదాలో ఒక యూనిక్ పాయింట్ ని టచ్ చేశాం. అది ఇప్పుడు రివిల్ చేయకూడదు. సినిమా చూసినప్పుడు అందరు ఖచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారు. హిట్ 3 కి ముందే ఈ కథ విన్నాను. కథ చాలా నచ్చింది. అయితే ముందుగా హిట్3 రిలీజ్ అయ్యింది.నాకు రొమాంటిక్ కథల్లో నటించడం అంటే చాలా ఇష్టం.సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు.Shrinidhi Shetty Interview

డైరెక్టర్ నీరజ గారి విజన్ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నీరజ చాలా సాఫ్ట్, సపోర్టివ్ గా వుంటారు.ఈ సినిమాలో చేసిన రాగ క్యారెక్టర్ నా రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఈ రోల్ లో వున్నా గ్రెయ్ షేడ్ మాత్రం నాకు రియల్ లైఫ్ లేదు.సిద్ధూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిద్ధూ టైమింగ్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా సిద్ధూ కి అన్ని డిపార్ట్మెంట్స్ లో పూర్తి అవగాహన వుంది.ఒక యాక్టర్ అదొక అదృష్టం.ఇక రాశీ ఖన్నా ఐతే చాలా డిసిప్లేన్ గా ఉంటుంది. తనని చూసి చాలా నేర్చుకున్న.వెంకటేష్, త్రివిక్రమ్ గారి సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రొడ్యూసర్స్ చెప్తారు త్వరలో…” అంటూ చెప్పుకొచ్చారు.