Shruti Haasan On Power Star: శృతి హాసన్ ఒకప్పుడు ఐరన్ లెగ్ కానీ.. ఇప్పుడు గోల్డెన్ లెగ్. ఆమె సినిమాలో నటిస్తే చాలు.. ఆ సినిమా హిట్టే అనేంతగా పేరు తెచ్చుకుంది. అయితే.. ఈ అమ్మడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం శృతి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో నటిస్తుంది. ఆగష్టు 14న కూలీ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఇంతకీ.. శృతి ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నారా..? అయితే.. ఈ వీడియో చూడాల్సిందే.
శృతి హాసన్ టాలీవుడ్ లో అనగనగా ఓ థీరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు. ఆతర్వాత నటించిన ఓ మై ఫ్రెండ్, త్రి సినిమాలు కూడా శృతికి విజయాన్ని ఇవ్వలేదు. దీంతో శృతి హాసన్ నటిస్తే.. ఆ సినిమా ఫ్లాపే.. ఆమె ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. అలాంటి టైమ్ లో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కు జంటగా శృతిని ఫైనల్ చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో శృతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆతర్వాత ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య, నటసింహం బాలకృష్ణకు జంటగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలు ఒకే నెలలో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి.
హాయ్ నాన్న, సలార్.. ఇలా శృతి నటిస్తే.. ఆ సినిమా బ్లాక్ బస్టరే అనే పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడు కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఇలా భారీ తారాగణంతో రూపొందడంతో కూలీ సినిమా పై అంచనాలు ఆకాశంలో కూర్చున్నాయి. ఇందులో శృతి క్యారెక్టర్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చింది తెలుగు పరిశ్రమ అని చెప్పింది. గబ్బర్ సింగ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఆ పాత్రలో నటించలేమో అని నో చెప్పిందట. అయితే.. ఆ పాత్రకు మిమ్మల్ని తప్పా వేరే వాళ్లను ఊహించుకోలేను మీరే చేయాలని హరీష్ శంకర్ చెప్పి ఓప్పించారట.
ఈ సినిమా సెట్ లో పవన్ కళ్యాణ్ ఎక్కువుగా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల గురించి చెప్పేవారట. ఆయనకు రాజకీయ రంగం కరెక్ట్ గా సరిపోతుంది అని శృతి చెప్పడం ఆసక్తిగా మారింది. పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లికి చాలా దగ్గరగా వెళ్లాను కానీ.. అది కుదరలేదన్నారు. ఇద్దరు మనుషులు ఒకటవ్వాలంటే.. వారి అభిప్రాయాలు కలవాలి.. పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు.. ఇది జీవిత కాలపు బాధ్యత అని చెప్పింది. అందుకనే పెళ్లంటే భయమేస్తుందని తన మనసులో మాటలు బయటపెట్టింది. ఈ మాటలను బట్టి.. ఇప్పటికే ఎక్కువ బ్రేకప్ లు అవ్వడం బట్టి శృతి పెళ్లి చేసుకోదేమో అని ప్రచారం జరుగుతుంది. మరి.. భవిష్యత్ లో పెళ్లి కబురు చెబుతుందో లేదో చూడాలి. Shruti Haasan On Power Star.
పవర్ స్టార్ గురించి శృతి సంచలన వ్యాఖ్యలు..!

Also Read: https://www.mega9tv.com/cinema/paradise-created-a-sensation-with-glimpses-of-srikanth-odela-presenting-nani-in-a-new-way/