
Tej’s sambarala yetigattu: మెగాస్టార్ మేనల్లుడు సాయిదుర్గ తేజ్.. విరూపాక్ష, బ్రో చిత్రాలతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే.. స్పీడు తగ్గించాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఇప్పుడు డేట్ కి రావడం లేదు. ఇదిలా ఉంటే.. తేజ్ మెగా ప్లాన్ రెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. సంబరాల ఏటిగట్టు వచ్చేది ఎప్పుడు..? తేజ్ మెగా ప్లాన్ ఏంటి..?
సంబరాల ఏటిగట్టు.. ఈ సినిమాను దాదాపు 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హనుమాన్ చిత్ర నిర్మాతలు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఆమధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. సెప్టెంబర్ 25న ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అదే డేట్ కి బాలయ్య అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు ప్లాన్ చేస్తుండడంతో పోస్ట్ పోన్ అయ్యింది. మరి.. ఎప్పుడు సంబరాల ఏటిగట్టు ఎప్పుడు వచ్చేది త్వరలోనే ప్రకటిస్తారని తెలిసింది. Tej’s sambarala yetigattu.
ఇక తేజ్ మెగా ప్లాన్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆమధ్య కెరీర్ లో గ్యాప్ బాగా వచ్చింది. అందుకనే ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేలా రెండు సినిమాలు ఓకేసారి చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే అని సమాచారం. ఇందులో ఒక సినిమాని అక్టోబర్ లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సివుంది. త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
తే్జ్ చేసే రెండో సినిమా కూడా పాన్ ఇండియా మూవీనే. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని.. ఈ మూవీని జనవరిలో పట్టాలెక్కించనున్నారని సమాచారం. సంబరాల ఏటిగట్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి మరింత స్పీడు పెంచుతాడట. ఈ రెండు సినిమాలే కాకుండా మూడో సినిమాకి సంబంధించిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయట. దీనిని బట్టి తేజ్ దూకుడు పెంచాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ లెక్కన తేజ్.. సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తాడేమో చూడాలి.