
OG universe: ‘ఓజీ’ సినిమాతో సంగీత దర్శకుడు తమన్ మరోసారి తన సత్తా చాటాడు. ఈ చిత్రం కోసం తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ తెరపై కనిపించే ప్రతి సన్నివేశాన్ని తమన్ సంగీతంతో ఎలివేట్ చేస్తూ సినిమా స్థాయిని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఈ విజయంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటూ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాటిలో కొన్ని ఇంటర్వ్యూల్లో ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ, సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ చేసిన కామెంట్లు అభిమానులను ఫుల్ ఖుషీ చేసాయి. ఆయన మాటల ప్రకారం, ‘ఓజీ’ కథ ఇక్కడితో ముగియదంటూ ఓ బిగ్ హింట్ ఇచ్చాడు. ‘ఓజీ యూనివర్స్’ అనే కాన్సెప్ట్‌ను 10 సంవత్సరాల పాటు కొనసాగించే ఆలోచన ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ సుజీత్ కూడా కన్ఫర్మ్ చేస్తూ, ‘ఓజీ’కి సీక్వెల్ మాత్రమే కాకుండా ప్రీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారు. అయితే, ఇది రెండు విడతలుగా కాదు… ఒకేసారి రెండు భాగాలూ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.
ఈ అప్‌డేట్‌కి ఫ్యాన్స్ నుంచి గట్టిగా స్పందన వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘ఓజీ 2’ టైటిల్స్‌తో పాటు ఫ్యాన్‌మేడ్ పోస్టర్స్ చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ అసలు పవర్‌ను చూపించేది ఇది కాదని, ఇప్పటి దాకా సినిమా కేవలం ఓ సాంపిల్ మాత్రమేనని సుజీత్ వ్యాఖ్యానించడం కూడా అంచనాలను అమాంతం పెంచేసింది. OG universe.
‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఈ స్పీడ్ కొనసాగితే, త్వరలోనే బ్రేక్ ఈవెన్‌కు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే ‘ఓజీ’ సీక్వెల్ మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో కీలక పాత్రలో ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ పనులతో బిజీగా ఉండడంతో సినిమాలకు సమయం ఎలా కేటాయిస్తారన్నది ఆసక్తికర విషయంగా మారింది. అయినప్పటికీ, ‘ఓజీ’ సీక్వెల్‌కు మాంచి స్థాయి ప్లానింగ్‌తోనే ముందుకెళ్లాలని సుజీత్ భావిస్తున్నారు.