ప్యారడైజ్ విలన్ .. మోహన్ బాబు లుక్ అరాచకం అంతే!

Mohan Babu First Look: న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే ఈ సినిమా దసరా కంటే కూడా మోసం చేస్తూ, రా అండ్ రస్టిక్ టోన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇంతవరకూ అన్నీ ఒకెత్తయితే, ఈ చిత్రంలో నానికి పోటీగా మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తుండటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ది ప్యారడైజ్’లో తన నాన్నగారు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు, ఆ లుక్ కోసం ఆయన చాలా కష్టపడ్డారని చెప్పిన విషయం తెలిసిందే.

ఆ మాటలకు తాజాగా మేకర్స్ విడుదల చేసిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ అది నిజమే అని ప్రూవ్ చేసింది. ఈ పోస్టర్‌లో ఆయన ‘షికంజా మాలిక్’ అనే పాత్రలో పరిచయమయ్యారు. లుక్ విషయానికొస్తే.. షర్ట్ లేకుండా, రక్తంతో తడిసిన చేతుల్లో తుపాకీ పట్టుకొని, కళ్ళజోడు వేసుకుని, మరో చేతిలో సిగార్ తో చెయిర్ మీద కూర్చొన్న మోహన్ బాబు ఫెరేషిగా, టెర్రిఫిక్ గా కనిపించారు.

ఇప్పటికే ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి రూపంలో మోహన్ బాబును ఇప్పటి వరకూ చూడలేదన్న ఫీల్ ప్రేక్షకుల్లో రాజుకుంటోంది. ఆయన లుక్ సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మోహన్ బాబు ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో విలన్‌గా నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కానీ, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయనను చూసి చాలా కాలమే అవుతోంది. ఇక ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ చిత్రంతో మళ్లీ శక్తివంతమైన విలన్ పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పోషిస్తున్న “శికంజా మాలిక్” అనే క్యారెక్టర్ బహుశా విలనిజానికి కొత్త నిర్వచనం ఇవ్వనుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇంతకముందు విడుదలైన గ్లింప్స్‌ లో నానిని ‘కాకి’గా చూపిస్తే, మోహన్ బాబుని ‘చిలుక’తో పోల్చుతూ ఈ ఇద్దరి మధ్య జరిగే ఢీ లాంటి పోరాటం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కాకి vs చిలుక — ఈ క్రేజీ ఫేసాఫ్ ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. Mohan Babu First Look.

ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి తన ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు‌తో పాటు తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా మొత్తం 8 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పని చేస్తున్న ఈ సినిమాకు, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు.‘ది ప్యారడైజ్’ 2026 మార్చి 26న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.