రామ్ రాసిన పాటకు తెలుగు ఆడియన్స్ ఫిదా.!

Ram’s Nuvvunte Chaley: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, అందాల భామ భాగ్య శ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ ఆంధ్రా కింగ్ తాలుకా’. ఈ చిత్రంలో రామ్ విభిన్నంగా కనిపించబోతున్నారు. టైటిల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా పై రామ్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా రామ్, భాగ్య శ్రీ మధ్య కెమిస్ట్రీ అయితే అభిమానులకు కనుల విందు చేస్తుంది.’ ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాలో రామ్ తన నటనలో వైవిధ్యాన్ని చూపించబోతున్నాడు అని టాక్ కూడా వినిపిస్తుంది.

పి. మహేశ్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రామ్ పోతినేని ని వైవిధ్యంగా చూపించడానికి డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే రామ్ ఈ సినిమాలో తనలో ఉన్న టాలెంట్ ను అభిమానులకు అందించారు. అది ఏంటంటే తనలో ఉన్న రైటర్ ను బయటకు తీసుకువవచ్చాడు రామ్.ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని తనలో ఉన్న భావాలను కలిపి ఎంతో అద్భుతంగా ఈ పాటకు లిరిక్స్ అందించారు రామ్. Ram’s Nuvvunte Chaley.

రామ్ లో ఇంత మంచి ప్రేమికుడు దాగి ఉన్నాడా అని తను రాసిన పాట అయిన ‘నువ్వుంటే చాలు ‘ తో రుజువు అయింది. ముఖ్యంగా ఈ పాట ప్రేమికులకు, యూత్ కు ఎంతగానో నచింది. ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్ లో ఈ పాట వినిపిస్తుంది. అనిరుధ్ అందించిన సంగీతం అందరినీ కట్టిపడేసేలా ఉంది.ఈ పాటలో రామ్ మరియు భాగ్య శ్రీ కాంబినేషన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇపుడు సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏకంగా 25 మిలియన్ల పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీంతో రామ్ హీరో గానే కాదు, లిరిసిస్ట్ గా కూడా ఇరగదీశాడు అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.