మెగా 157 సరికొత్త టైటిల్ ఇదే..!

Chiranjeevi and Anil Ravipudi’s movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవికి జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. అయితే.. ఇంత వరకు ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. ఆమధ్య ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు సరికొత్తగా మరో టైటిల్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఆమధ్య బయటకు వచ్చిన టైటిల్ ఏంటి..? ఈమధ్య లీకైన టైటిల్ ఏంటి..?

చిరు – అనిల్ రావిపూడి కాంబో మూవీకి టైటిల్ అఫిషియల్ గా ప్రకటించలేదు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా జరుగుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో సెంటిమెంట్ గా చిరుతో సినిమాకి కూడా సంక్రాంతికి అనేది టైటిల్ లో వచ్చేలా చూస్తున్నారని టాక్ వినిపించింది. దీంతో ఈ క్రేజీ మూవీకి సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవంలోనూ, నయనతారతో ప్రమోషనల్ వీడియో చేసినప్పుడు కూడా సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అనే మాటను అనిల్ రావిపూడి ఉపయోగించారు. దీంతో ఈ మాటే ఈ సినిమా టైటిల్ అంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ.. ఏంటా టైటిల్ అంటే.. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కూడా శివ శంకర్ వర ప్రసాద్ అనే పెట్టారట. అయితే.. ఇప్పుడు సినిమాకి మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారని న్యూస్ లీకైంది. ఈ లీకైన వార్త నిజమో కాదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ మాత్రం వైరల్ అయ్యింది. ఈ సినిమాకి ఈ టైటిల్ నే పెడితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఇది ట్రీట్ అని చెప్పచ్చు. Chiranjeevi and Anil Ravipudi’s movie.

ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి అభిమానులు వావ్ అనిపించేలా ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అయితే.. ఈసారి చిరు బర్త్ డేకి ఒకటి కాదు.. రెండు ట్రీట్స్ రాబోతున్నాయని టాక్. ఒకటి విశ్వంభర సినిమా నుంచి అయితే.. రెండోది అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ నుంచి. ఈ రెండు సినిమాల నుంచి టీజర్ రిలీజ్ చేస్తారా..? లేక సాంగ్స్ రిలీజ్ చేస్తారా..? మెగా 157 టైటిల్ అనౌన్స్ చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. సెప్టెంబర్ లో విశ్వంభర, జనవరిలో మెగా 157 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన మూడు నెలల గ్యాప్ లోనే మెగాస్టార్ నుంచి రెండు భారీ సినిమాలు రావడం అంటే.. మెగా అభిమానులకు పండగే.

Also Read: https://www.mega9tv.com/cinema/director-shankar-announces-new-movie-and-who-is-the-hero-acting-in-shankars-movie/