
Rajasaab Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ ది రాజాసాబ్. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్ధ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో రావాలి కానీ.. ఇంత వరకు రిలీజ్ కాలేదు. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ది రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆతర్వాత సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజాసాబ్ కోర్టు కష్టాలు అనే వార్త బయటకు వచ్చింది. అసలు ఏమైంది..? రాజాసాబ్ కు కోర్ట్ కష్టాలు ఏంటి..?
రాజాసాబ్ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఐవీ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ కో ప్రొడ్యూసర్ గా డీల్ కుదుర్చుకుంది. సినిమా నిర్మాణం కోసం ఐవీ ఎంటర్టైన్మెంట్ 225 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే 218 కోట్లు వెచ్చించిందట. అయితే.. ఈ సినిమా ఎంతకు రిలీజ్ కావడం లేదు. ఎలాంటి అప్ డేట్ ఈ సంస్థకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇవ్వడం లేదట. అందుచేత ఢిల్లీ హైకోర్టులో ఈ సంస్థ పిటిషన్ వేసిందట. సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఇస్తానన్నారని, కానీ సినిమా తరచూ వాయిదా వేస్తూ వస్తున్నారని, చెప్పిన టైమ్ కు సినిమాను రిలీజ్ చేయలేదని పేర్కొంది.
తాము ఇచ్చిన పెట్టుబడి 218 కోట్లు.. అలాగే 18 శాతం వడ్డీతో సహా ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొంది. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ కూడా సవాల్ చేసిందని.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని.. కొన్ని కారణాల వలన ఈ మూవీ ఆలస్యం అయ్యిందని.. అయితే.. తమ సంస్థ పరువు తీస్తుందని పిటీషన్ వేసిందని సమాచారం. దీంతో రాజాసాబ్ మూవీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా అప్ డేట్ ఏంటంటే.. ఓ వైపు సమ్మె జరుగుతున్నప్పటికీ.. కొన్ని రోజులు షూటింగ్ ఆగకుండా జరిగింది. అక్టోబర్ కు ఈ మూవీ ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని తెలిసింది. Rajasaab Release Date.
ఇక రిలీజ్ ఎప్పుడు అంటే.. డిసెంబర్ 5న ది రాజాసాబ్ మూవీని రిలీజ్ చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించినా.. అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని.. జనవరి 9న రిలీజ్ చేయమని నిర్మాత పై ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. దీంతో రాజాసాబ్ డిసెంబర్ 5న వస్తుందా…? జనవరి 9న వస్తుందా..? అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. ఏం జరగనుందో అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.