
Veeramallu destruction Pan India range: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమాకి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లు సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో… ఓవర్ సీస్ లో సైతం భారీగా బజ్ క్రియేట్ అయ్యింది. ఓవర్ సీస్ లో.. ఆల్రెడీ షోస్ పడ్డాయి.. ఇంతకీ.. వీరమల్లు రియల్ టాక్ ఏంటి..? అక్కడ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి..?
వీరమల్లు సినిమా గురించి ఎక్కడ చూసినా.. ఒక్కటే టాక్.. వీరమల్లు విధ్వంసం.. బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ ఒక్కటే వినిపిస్తోంది. సాధారణంగా నిర్మాణంలో ఆలస్యం అయిన సినిమాలు అంతగా ఆకట్టుకోవు. అందులోనూ.. ఐదేళ్ల నిర్మాణంలో ఉన్న సినిమా అంటే.. జనాలకు అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అయితే.. ఇది పవర్ స్టార్ సినిమా. అందుకనే.. అంచనాలకు మించిన విజయాన్ని సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతుంది. పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ పర్ ఫార్మెన్స్ తో అదిరిపోయే విజువల్స్ తో వావ్ అనిపించింది.
పీరియాడిక్ సినిమా అంటే.. అందరికీ కనెక్ట్ కాదు అనుకుంటారు. అయితే.. ఈ సినిమాని క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందించడం విశేషం. పవర్ స్టార్ చెప్పే డైలాగ్స్.. భారీ యాక్షన్ ఎపిసోడ్స్.. సాంగ్స్.. ఇలా ఒక్కటేమిటి సినిమా అంతా కూడా ఆడియన్స్ కి థ్రిల్లింగ్ గా ఉంది. ఇలా ఉండడం వలన సినిమా అంచనాలకు మించిన విజయం సాధిస్తోందని చెప్పచ్చు. జనరల్ గా ఏ సినిమాకి అయినా ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా.. ఎక్కడో కాస్త నెగిటివ్ టాకో.. ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగున్ను అనే మాట వినిపిస్తుంటుంది. Veeramallu destruction Pan India range.
ఈ సినిమాకి మాత్రం ఎక్కడ చూసినా పాజిటివ్ టాకే వినిపిస్తుంది. ఈ సినిమా సక్సెస్ లో చెప్పుకోవాల్సిన మరో విషయం మ్యూజిక్. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి దీనికి అదిరిపోయే సంగీతం అందించారు. హీరోయిన్ నిథి అగర్వాల్ ఈ సినిమాలో నటించడం మాత్రమే కాదు.. ఈ సినిమాని తన భుజాలపై వేసుకుని ఎంతగా ప్రమోట్ చేసిందో చూశాం. ఈ మూవీలో తన పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఐదేళ్లు ఈ సినిమా కోసం వెయిట్ చేసినందుకు ఆమె కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. క్రిష్, జ్యోతికృష్ణ ఎవరు ఎంత వరకు తెరకెక్కించారు అనేది కరెక్ట్ గా చెప్పలేము కానీ.. ఈ సినిమాని మాత్రం ఈ ఇద్దరు దర్శకులు అందరికీ నచ్చేలా మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తానికి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతుంది. మరి.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.