అదిరిపోయే న్యూస్ బాసూ…వీరమల్లు పార్ట్ 2 ఎప్పుడంటే..?

Pawan Kalyan Veeramallu Part 2: వీరమల్లు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. భారీ అంచనాలతో వీరమల్లు వచ్చింది. ఐదేళ్లు నిర్మాణం జరుపుకున్న సినిమా కావడం.. పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో వీరమల్లుకు భారీగా క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ సినిమాను రెండు పార్టులుగా తీస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు వీరమల్లు ఫస్ట్ పార్ట్ వచ్చింది. మరి.. సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పినా.. నిజంగా ఉంటుందా అనే డౌట్ చాలా మందిలో ఉంది. దీనికి కారణం ఏంటి..? వీరమల్లు పార్ట్ 2 ఎప్పుడు ఉండచ్చు..?

వీరమల్లు పార్ట్ 2 కు సంబంధించిన వర్క్ 25 శాతం కంప్లీట్ అయ్యిందని.. ఖచ్చితంగా పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. స్వయంగా పవన్ కళ్యాణ్ పార్ట్ 2 గురించి స్పందించారు. పార్ట్ 1 కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో మరింత క్వాలిటీ కంటెంట్ తో పార్ట్ 2 చేస్తామని అన్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ఓ పది రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత కొత్త సినిమాకి ఓకే చెప్పలేదు. ఇక నుంచి నిర్మాతగా సినిమాలు చేస్తాను కానీ.. హీరోగా చేయడం అనేది డౌటే అని పవన్ కళ్యాణ్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. Pawan Kalyan Veeramallu Part 2.

మరి.. వీరమల్లు పార్ట్ 2 ఉంటుందా అంటే.. ముందుగా వీరమల్లు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. నిర్మాతకు లాభాలు తీసుకురావాలి.. సెకండ్ పార్ట్ చేయాలనే జోష్ కలిగించారు. అన్నింటి కంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వాలి. ఇదంతా జరిగితే అప్పుడు పార్ట్ 2 గురించి ఆలోచించచ్చు. ఈమధ్య కాలంలో చాలా సినిమాలను రెండు పార్టులుగా తీస్తామని ప్రకటిస్తారు. ఆతర్వాత ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ అయితే.. సెకండ్ పార్ట్ తీయడం ఆపేస్తారు. అందుచేత వీరమల్లు పార్ట్ 2 రావాలంటే.. ముందుగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి.. నిర్మాతకు భారీగా లాభాలు తీసుకురావాలి.

అయితే.. స్వయంగా పవన్ కళ్యాణే వీరమల్లు పార్ట్ 2 ఉంటుందని.. పార్ట్ 1 కంటే బెటర్ గా తీస్తామని చెప్పారు కాబ్టటి ఖచ్చితంగా ఈ సినిమా ఉండచ్చు. కాకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత పాలిటిక్స్ పై మరింతగా ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుచేత వీరమల్లు పార్ట్ 2 గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Also Read: https://www.mega9tv.com/cinema/balayyas-movie-fixed-with-pawan-director-krish-doing-a-movie-with-balayya-aditya-369-sequel-aditya-999-movie-director-krish/