
Vishwambhara & Mega 157: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరకు విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అయితే.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్టార్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే.. ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్ ప్లాన్స్ మారాయి అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. విశ్వంభర, మెగా 157 వచ్చేది ఎప్పుడు..?
విశ్వంభర సినిమాను వైవిధ్యమైన కథాంశంతో మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్నాడు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ చేయలేదు. అందుచేత ఈ తరహా కథ చెప్పగానే మెగాస్టార్ థ్రిల్ ఫీలై వెంటనే ఈ సినిమా చేయాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే చక చకా షూటింగ్ కానిచ్చేసారు. అయితే.. గత సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. వీఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడం.. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రావాలి అనుకోవడంతో విశ్వంభర పోస్ట్ పోన్ అయ్యింది. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. Vishwambhara & Mega 157.
జులైలో వస్తుందని ప్రచారం జరిగింది. ఆతర్వాత ఆగష్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా వస్తుందని టాక్ వచ్చింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. దీపావళికి విశ్వంభర మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉందట. ఈ వర్క్ కంప్లట్ కాగానే రిలీజ్ డేట్ లాక్ చేసి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ రాగానే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
ఇక విశ్వంభర దీపావళికి వస్తే.. మెగా 157 ఎప్పుడు వస్తుంది అనే హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న మెగా 157 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. సంక్రాంతి టార్గెట్ గానే వర్క్ స్టార్ట్ చేశారు. ఆ విధంగా పక్కా ప్లానింగ్ తో దూసుకెళుతున్నారు. అనిల్ రావిపూడి చాలా స్పీడుగా ఈ సినిమాని చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ఈ సినిమా రెడీ అవుతాది కానీ.. విశ్వంభర అక్టోబర్ లో వస్తే.. రెండు నెలల గ్యాప్ లోనే సంక్రాంతికి చిరంజీవి మళ్లీ సినిమాను రిలీజ్ చేయడం కంటే ఇంకొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుందని ఫీలవుతున్నారట. అందుకనే సమ్మర్ లో రిలీజ్ చేయాలని మెగా 157 ప్లాన్ మారిందని తెలిసింది. మరి.. విశ్వంభర, మెగా 157 రిలీజ్ డేట్స్ పై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/coolie-trailer-real-talk-on-chennai-pre-release-event/