
VK Naresh Actress Vasuki: అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో నేడు ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించిన సీనియర్ నటుడు వీకే నరేష్, నటి వాసుకి మీడియాతో ముచ్చటించి సినిమా గురించి తెలిపారు.
సీనియర్ నటుడు వీకే నరేష్ బ్యూటీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా సోల్, ఈ సినిమా థీమ్ మాత్రమే ఈ సినిమాకు బ్యూటీ. సుబ్బు రాసిన కథని దర్శకుడు వర్ధన్ అందంగా మలిచాడు. సింఫనీ ఆఫ్ క్రాఫ్ట్ ఈ సినిమా. అన్ని కుదిరాయి దీనికి. ఇటీవల ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమాలు తగ్గాయి. ఇందులో ఆ రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రేక్షకులకు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటే నచ్చట్లేదు. ఆర్గానిక్ గా ఉండాలి. అలా ఉంటేనే నచ్చుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ఆర్గానిక్ గా లేదు అని మీకు అనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను అని ఛాలెంజ్ చేశాను నేను. ఇంటర్వెల్ కి ఆశ్చర్యపోతారు అందరూ. సెకండ్ హాఫ్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను మారుతీ గారిని ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడావు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని అడిగితే సోల్ ఆఫ్ సినిమా అన్నారు. ఇవాళ మంచి సినిమా, చెడ్డ సినిమా అని కాదు వాళ్ళు పెట్టే డబ్బులకు సంతృప్తి చెందుతున్నారా లేదా చూస్తున్నారు ఆడియన్స్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూడొచ్చు. ప్రతి సినిమాలో ఏదో ఒక చిన్న సమస్య ఉండొచ్చు. కానీ దీంట్లో ఏమి లేకుండా అంతగా వర్కౌట్ చేసారు. త్రిమూర్తులు ఈ సినిమాకు వానర సెల్యులాయిడ్స్, జీ స్టూడియోస్ నుంచి నిమ్మకాలయ ప్రసాద్, మారుతీ స్టూడియోస్ ముగ్గురు కలిసి సినిమాని పర్ఫెక్ట్ గా తీశారు. ఈ సినిమాలో ప్రస్తుత జనరేషన్ తమను తాము చూసుకుంటారు. ఈ రోజుల్లో మ్యారేజ్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అది ఒక కమిట్మెంట్. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్, కలిసి ఎంజాయ్ చేసి విడిపోవడం అంతే. ఇప్పటి పిల్లలకు మనం ఏమి చెప్పలేము. ఫ్రెండ్ గా ఉండటమే చేయాలి. ఒక రియలిస్టిక్ కంటెంట్ ని అందంగా చూపించారు. వాసుకి మెథడ్ యాక్టింగ్ పీక్స్ చూపించింది. అందరి పర్ఫార్మెన్స్ లు ఆర్గానిక్ గా ఉంటాయి. ఈ సినిమాలో హీరోయిన్ పర్ఫెక్ట్ కాస్ట్. చాలా అందంగా పెర్ఫార్మ్ చేసింది. అంకిత్ అద్భుతంగా పర్ఫార్మ్ చేసాడు.
ఈ సినిమాకి అతనే సర్ ప్రైజ్. మేము అతని దగ్గర నేర్చుకోవాలి. హీరో – హీరోయిన్స్ పాత్రలతో సినిమా అనేది ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు అన్ని లీడ్ రోల్స్ మాత్రమే. ఈ కథ విన్నప్పుడు నేను మెస్మరైజ్ అయ్యాను. నేను కథ విన్నాక మారుతీ గారిని ఈ సినిమా నేను చేయగలనా లేదా అని అడిగితే మీరు వంద శాతం పండిస్తారు అన్నారు. చిన్న అపార్ట్మెంట్ లో చాలా కష్టపడి షూట్ చేసాము. ఓల్డ్ సిరీస్ లో మట్టిలో తిరిగే సీన్స్ చేశాను. ఈ సినిమాలో కథ ఆడియన్స్ పాయింట్ నుంచి తీసుకెళ్లారు. అది కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఏమన్నా తప్పులు ఉంటే నేను మీ ముందుకు వచ్చి నిలబడతాను. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ చాలా బాగా ఇచ్చారు. చిన్న చిన్న లొకేషన్స్ లో కూడా అమేజింగ్ విజువల్స్ ఇచ్చాడు కెమెరామెన్. ఆర్ట్ డైరెక్టర్ ని కూడా మెచ్చుకోవాలి. ఈ కథని జర్నలిస్ట్ రాసాడు అంటే ఎంత రియాలిటీ ఉంటుందో చూడండి. నాకు కూతురు లేదు అనే లోటు ఎప్పుడూ ఉండేది. ఆ లోటు కాదు కానీ కూతురు ఉంటే ఇంత పెయిన్ పడేవాడినా అని ఈ సినిమాలో అనుభవించాను. ఇవాళ్టి పిల్లలు ఏదో చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సినిమాలో ఆ అమ్మాయిని చూసి నేను ఆ పెయిన్ అనుభవించాను. చాలా సినిమాల్లో అమ్మ – కొడుకుల రిలేషన్ చూపించారు కానీ తండ్రి కూతుళ్ళ రిలేషన్ చాలా తక్కువ సినిమాల్లో చూపించారు. ఈ సినిమా చూసి అమ్మాయిలకు వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చి కంట్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి. ఇంట్లో అన్ని అమ్మ అయితే ఇంటికి కాంపౌండ్ వాల్ లాంటివాడు నాన్న. ఆ ఎమోషనే బ్యూటీ అని తెలిపారు. VK Naresh Actress Vasuki.
నటి వాసుకి మాట్లాడుతూ..
ఈ సినిమాలో ఎమోషన్ ఎంత కావాలో అంత ఉంటుంది. ఎంత రియాక్ట్ అవ్వాలో అంతే రియాక్ట్ అవ్వాలి ఎమోషన్ కి. నాకు కూతురు ఉంది. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ప్రతి అమ్మాయి చేసేది మా అమ్మాయి చేస్తుంది. ఈ కథ విన్నప్పుడు చెప్పిన పాయింట్ ఒక తల్లిగా నాకు కనెక్ట్ అయింది. ఒక తల్లికి, అమ్మాయికి ఉండాల్సిన అవగాహన, భాద్యత ఉన్నాయి ఈ కథలో. మదర్స్, పేరెంట్స్ గా మనం స్ట్రిక్ట్ గా ఉంటాం. కానీ పిల్లల పాయింట్ లో ఏముందో చూడాలి అని నా కూతురికి ఈ సినిమాని చూపించాను. జెన్యూన్ రివ్యూ ఇచ్చింది. ఇప్పటి పిల్లలకు ఏ సినిమా నచ్చుతుందో తెలీదు కానీ తను బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా చూసి. నాకు తెలిసింది ఉంది, తెలియంది ఉంది సినిమాలో. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. తను డైరెక్టర్ కి కాల్ చేసి.. నేను సింగిల్ గా ఉంటాను భయం ఉంటుంది కానీ ఇప్పుడు మంచి అవగాహన వచ్చింది అని థ్యాంక్స్ చెప్పింది. ఇప్పటి జనరేషన్ ని తిట్టి పెంచలేము. మంచిగా చెప్పాలి. ఈ జనరేషన్ కి తగ్గట్టే సినిమా ఉంటుంది. సినిమాకు నరేష్ సర్ మెయిన్ పిల్లర్. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫాదర్ ఎమోషన్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నరేష్ గారిని ఆ పాత్రలో చూసి మా నాన్న గుర్తొచ్చారు. అంకిత్ చాలా సెన్సిబుల్ యాక్టర్. అందరి హీరోలా కాదు తను. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. సక్సెస్ అవుతాడు. ఈ సినిమా కథ ఇప్పటి జనరేషన్ అమ్మాయిల అందరి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా చూస్తే అమ్మాయిలు – వాళ్ళ తండ్రుల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి అని తెలిపారు.