
War 2 Release on August 14: సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్.. వీరిద్దరి కాంబోలో రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ వార్ 2. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ పెరిగింది. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు.. ఎక్కడా ప్రివ్యూ పడలేదు కానీ.. మూవీ ఎలా ఉండబోతుందో బయటకు లీకైంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. వార్ 2 ఎలా ఉండబోతుంది..? ఎన్టీఆర్ కనిపించేది ఎప్పుడు..? ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో ఎన్టీఆర్ పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడా..? నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ లో కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాత్రం ఇందులో ఎవరు పాజిటివ్, ఎవరు నెగిటివ్ అని చూడకండి.. ఇద్దరూ హీరోలే అని చెప్పారు. దీంతో వార్ 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక ఎన్టీఆర్ అయితే.. ఈ సినిమాలో చాలా సర్ ఫ్రైజ్ లు ఉన్నాయి. వాటిని లీక్ చేయకండి.. అని చెప్పారు. దీనిని బట్టి ట్విస్టులు.. సర్ ఫ్రైజ్ లు చాలానే ఉన్నాయి అనిపిస్తుంది.
ఇక లీకైన న్యూస్ ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాలకు కనిపిస్తాడట. ఫస్టాప్ అంతా ఎన్టీఆర్ దే డామినేషన్ అని టాక్ వినిపిస్తోంది. అలాగే ఇంటర్వెల్, క్లైమాక్స్.. సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వార్ 2 సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. ప్రమోషన్స్ లో వెనకబడిందని వార్తలు వచ్చాయి కానీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుంచి మరింతగా బజ్ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ ఈ సినిమా అదిరిపోయింది.. కుమ్మేద్దామని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. War 2 Release on August 14.
తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ లో రెండు రోజుల క్రితం కూలీ ముందుంజలో ఉన్నప్పటికీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నుంచి వార్ 2 స్పీడు పెరిగిందని తెలిసింది. గంట గంటకు బుక్ మై షోలో టిక్కెట్ సేల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే.. వార్ 2 కు ఫస్ట్ డే బిగ్ నెంబర్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. అలాగే ఇప్పటి వరకు టాక్ ఎలా ఉన్నా… రిలీజ్ తర్వాత వార్ 2 కు హిట్ టాక్ రావడం.. ఆతర్వాత నుంచి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లడం ఖాయం అంటున్నారు మేకర్స్. మరి.. వార్ 2 మేకర్స్ నమ్మకాన్ని ఎంత వరకు రీజ్ అవుతుందో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/coolie-to-release-on-august-14-high-expectations-on-the-coolie-movie/